Wednesday, January 15, 2025

యాదాద్రిలో పెరిగిన భక్తులు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం, ఆదివారం రెండు రో జులు సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న భక్తజను లు శ్రీవారి ఆలయంలో జరుగు నిత్యపూజలలో పాల్గొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయం తెరిచిన ఆర్చకులు సుప్రభాత సేవతో ఆలయ పూజలకు శ్రీకారం చుట్టారు.

శ్రీ స్వామివారి దర్శనార్ధం తరలివచ్చి న భక్తులు తెల్లవారుజాము నుండే యాదాద్రి కొండకు చేరుకొని శ్రీవారి దర్శనముతోపాటూ ఆలయంలో జరిగిన నిత్యపూజలు అభిషేకం, అర్చన, సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం,సువర్ణ పుష్పార్చన. వెండి జోడిసేవ,దర్బార్ సేవ తోపాటూ శ్రీ వారి సిన్నధిలో జరుగు శ్రీ సత్యనారాయణ వ్రతపూజలలో భక్తులు పాల్గొని ద ర్శించుకున్నారు. కొండపైన కొలువుదీరిని శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి శివాలయంలో శివ దర్శనముతో పాటు, కొండకింద శ్రీపాతలక్ష్మీనరసింహుని భక్తులు దర్శించుకొని పూజలు నిర్వహించారు.

ఆలయ నిత్యరాబడి..
స్వామివారి ఆలయ నిత్యరాబడిలో భాగంగా శనివారం రూ.30,59,522 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం,అర్జిత సేవలు,విఐపి దర్శనము,కొండపైకి వాహనాల అనుమతి, పాతగుట్ట, శివాలయం ఇతర శాఖల నుండి ఆలయ నిత్యరాబడి సమకురినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

స్వామివారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు జడ్జి
స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ గోపాలకృష్ణరావు కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజ లు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న జస్టిస్ గోపాలకృష్ణరావు దంపతులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనము చేయగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News