Thursday, April 3, 2025

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. స్వామివారి ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు వేచివుండాల్సి వస్తోంది. సర్వదర్శనం కోసం వెళ్లే భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. రూ.300తో శ్రీఘ్ర దర్శనం కోసం వెళ్లే వారికి 3నుండి4గంటలు సమయం పడుతోంది. సర్వ దర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4నుండి 5గంటలు సమయం పడుతోంది.

ఆదివారం ఒక్క రోజే స్వామివారిని 85వేలమంది భక్తులు దర్శించుకున్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. స్వామివారికి 43862మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమల వెంకన్న హుండీ ఆదాయం రూ4.21కోట్లు వచ్చినట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News