Wednesday, January 22, 2025

బోనాల ఉత్సవాలతో భక్తులు ఆధ్మాత్మిక భావాలను పెంపొందించుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి

పరిగి: ఆషాడం బోనాల ఉత్సవాలతో భక్తులు ఆధ్మాత్మిక భావాలను పెంపొందించుకోవాని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. పరిగి మున్సిపల్ పరిధిలోని ఏడవ వార్డులోని బహార్‌పేట్ పోచమ్మ దేవాలయంలో బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపిపి కరణం అరవింద్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకుడు ప్రవీణ్‌రెడ్డి, పిఏసిఎస్ వైస్‌చైర్మన్ భాస్కర్, మాజీ జడ్పీటిసి బాబాయ్య, సతీష్, తదితర నాయకులు కలిసి పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం జరగనున్న ఆషాడం బోనాల ఉత్సవాలను పరిగిలో ప్రజలు ఘనంగా జరుపుకోవాలని అన్నారు.

తమ తమ మొక్కులను భక్తి శ్రద్ద్ధలతో తీర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగేశ్వర్, మున్నీర్, జెఎసి రవి, నితీన్, హిందు ఉత్సవ కమిటీ సభ్యులు ముకుంద నాగేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News