మనతెలంగాణ/యాదాద్రి : తెలంగాణ ప్రసిద్ది క్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని దర్శనార్ధం భక్తజనులు పోటెత్తారు. వరసుగా మూడు రోజులు సెలవు దినములు కావడంతో శ్రీలక్ష్మీనరసింహుని దర్శనార్ధం తరలివచ్చిన భక్తుల రద్దీ ఆదివారం పెరిగింది. యాదాద్రి వాసుని దర్శనానికి వివిధ ప్రాంతాలనుండి భక్తులు రావడంతో ఆలయ ప్రాతం భక్తులతో కిటకిటలాడింది. శ్రీ స్వామి వారి దర్శనార్ధం భక్తులు కుటుంభ సభ్యులతో కలిసి యాదాద్రికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తెల్లవారు జామున 3.30 గంటలకు ఆలయం తెరిచిన అర్చక స్వాములు సుప్రభాత సేవ నిర్వహించారు.
శ్రీవారి దర్శనానికి తెల్లవారు జామునుండి ఆలయం చేరుకున్న భక్తులు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శంచుకొని ఆలయ నిత్యపూజలు అభిషేకం,అర్చన, సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, సువర్ణ పుష్పర్చన, వేండి జోడి సేవ, శ్రీత్యనారాయణ వత్రపూజలలో భక్తులు పాల్గొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.శ్రీవారి దర్శనము తోపాటూ కొండపైన కొలువుదీరిన శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి శివాలయంలో భక్తులు శివదర్శనము తోపాటూ కొండ కింద శ్రీ పాతలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో దర్శించుకొని ఆలయ నిత్యపూజలలో భక్తులు పాల్గొన్నారు.
ఆలయ నిత్యరాబడి…
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము ఆలయ నిత్యరాబడిలో భాగంగా ఆదివారం రోజున 64,46,277 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం ద్వార 27,47,450 కొండపైకి వాహన అనుమతితో 7,00,000, ప్రధాన బుకంగ్ ద్వార, 8,03,250 విఐపి దర్శనము ద్వార 6,00,000 బ్రేక్ దర్శనముతో 5,92,800 వ్రతపూజలతో 2,41,600 తోపాటూ పలు శాఖలు, పాతగుట్ట ఆలయం నుండి నిత్యరాబడి సమకూరినట్లు తెలిపారు.
శ్రీ స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు
శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని ఎమ్మెల్సీ కె.రఘోత్తం రెడ్డి దర్శించుకున్నారు. శ్రీ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ఆయనకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనము చేసి తీర్ధ ప్రసాదమును అందచేశారు. శ్రీవారిని నేషనల్ హైవే అథారిటి ఆఫ్ ఇండియా సెక్రటరి మెంబర్ మహభీర్ సింగ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీవారి స్వయంబు దర్శనము చేసుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనము అందచేశారు.
చల్లదనానికి రంగు
యాదాద్రి కొండపై మండే ఎండలకు భక్తుల కాళ్లు వేడితో కాలడంవల్ల ఆలయ ఆవరణలో నడవడానికి చల్లదనం ఉండటం కోసం ప్లోరింగ్‌పై తెల్లని రంగు వేయిస్తున్నారు. మెట్ల మార్గం వద్ద నుండి తూర్పు రాజగోపూరం, పచ్చిమ రాజగోపూరం వరకు చల్లదనం కోసం ప్లోరింగ్‌పై రంగు వేయిస్తున్నారు.