- Advertisement -
పాల్వంచ రూరల్ : మండల పరిధి కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్యలో కొలువై ఉన్న (శ్రీ కనకదుర్గ) పెద్దమ్మతల్లి దేవాలయం అధిక సంఖ్యలో వచ్చిన భక్తులతో ఆదివారం సందడిగా మారింది. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఒడి బియ్యం, చీరలు, కనుములు, తదితర మొక్కులు చెల్లించుకొన్నారు.
చంఢీహోమం : ఆలయ యాగశాలలో జూన్ 4వ, తేదీన చంఢీహోమం నిర్వహిస్తున్నామని ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎన్. రజనీ కుమారి తెలిపారు. హోమంలో పాల్గొనే భక్తులు ముందుగా గానీ, అదే రోజు గానీ రూ.2,516లు చెల్లించి రశీదు తీసుకొని గోత్ర నామాలు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9866923261 లేదా 6303408458 లకు ఫోన్ చేసి తెలుసుకోవాలని పేర్కొన్నారు.
- Advertisement -