Thursday, January 23, 2025

భగలాముఖి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు

- Advertisement -
- Advertisement -
  • పాల్గొన్న ప్రముఖులు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, సంఘ సేవకులు చాగళ్ల నరేంద్రనాథ్, హైకోర్టు సీనియర్ న్యాయవాది ట్రస్ట్ సభ్యులు శివకుమార్ గౌడ్, వ్యాపారవేత నందకుమార్

శివ్వంపేట: ప్రపంచంలోనే ప్రపధముగా నిర్మించబడిన తెలంగాణలోని మెదక్ జిల్లా శి వ్వంపేట మండల కేంద్రంలో మహా మహిమాన్విత భగలాముఖి శక్తిపీఠం కొద్ది నెలల క్రితమే ఆలయ ని ర్మాణం పూర్తయి అంగరంగ వైభవంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేపట్టిన అనాతి కాలంలోనే దేశ విదేశాల్లో భగలాముఖి శక్తిపీఠం జగత్ జననిగా అవతరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆదివారం అమావాస్య పర్వదినం పురస్కరించుకొని రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనం నిమిత్తం రాగా భలాముఖి ఉపాసకులు బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ వేద పండితుల ఆధ్వర్యంలో అభిషేకాలు అర్చనలు నిర్వహించి యాగశాలలో యజ్ఞం హోమం నిర్వహించి భగలాముఖి మహామంత్రావనం పూర్ణాహుతి విశేష పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ దంపతులు, ప్రముఖ సంఘ సేవకులు చాగళ్ల నరేంద్రనాథ్ (నరేన్), ప్రముఖ వ్యాపారవేత నందకుమార్, హై కోర్టు సీనియర్ న్యాయవాది, భగలాముఖి ట్రస్ట్ స భ్యులు జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్, తోపాజి అనంత కిషన్, న్యాయవాది అమర్నాథ్ గోపికృష్ణ , యశోద ఆసుపత్రి డాక్టర్ సతీష్ బాబు, రాధిక దంపతులు పాల్గొని అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొ ట్టి మ్రొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం క్రీస్తు శే షులు దాన గుణశాలి పబ్బ రాజమ్మ అంజయ్య గు ప్తా జ్ఞాపకార్థం వారి కుమారుడు పబ్బా రమేష్ గుప్తా స్వరూప దంపతుల కుమారుడు పబ్బ మహేష్ స్వా తి దంపతులు ప్రతి అమావాస్యకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ దంపతులు వారి చేతుల మీదగా భక్తులకు అన్నదానం నిర్వహించారు.

వచ్చిన భక్తులకు వితరణ చేశారు. వచ్చి న అతిథులకు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఆలయ పూజారులు సం తోష్ కుమార్ శర్మ, సంతోష్ శర్మ, స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ పద్మా వెంకటే ష్, వార్డు సభ్యులు బాసంపల్లి పోచగౌడ్, కొండల్ ముయ్యడి సింహం, బిఆర్‌ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షు డు లక్ష్మీ నరసయ్య, సూర్య, కుమార్ గౌడ్, దాహుద్, గొల్ల మహేష్, యాదగిరి ,బొడ్డు బిక్షపతి, బొ డ్డు రవి, మురళి, డి.వెంకటేష్, కాముని బాలకృష్ణ, సత్యనారాయణ గౌడ్ , భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News