Monday, January 20, 2025

గోదావరి వద్ద భక్తుల పూజలు

- Advertisement -
- Advertisement -

బాసర : నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు, చిన్నారులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నది తీరాన గల శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

భక్తులు చిన్నారులు అమ్మవారి దర్శన అక్షరభ్యాస పూజలకు క్యూలైన్‌లో బారులు తీరారు. భక్తులు తమ చిన్నారులకు ఆలయ సన్నిధిలో అక్షరభ్యాస మండపాలు అక్షరాభ్యాస పూజలను ఆలయ అర్చకులకే జరిపించారు. భక్తులు, చిన్నారులు ఆలయంలోని అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News