Monday, December 23, 2024

డిజిపి కార్యాలయంలో ఘనంగా ’తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా డిజిపి కార్యాలయంలో ’తెలంగాణా ఆధ్యాత్మిక దినోత్సవం’ను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానందచే ‘ఆధ్యాత్మికం ద్వారా ఆరోగ్యం‘ అనే అంశంపై ప్రసంగం ఏర్పాటు చేశారు. అడిషనల్ డిజిలు సందీప్ శాండిల్య, అభిలాష బిస్త్, మహేష్ భగవత్, సంజయ్‌కుమార్ జైన్, ఐజిలు షానవాజ్ కాసీం, రమేష్ రెడ్డి లతో పాటు పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు, డిజిపి కార్యాలయ అధికా రులు, సిబ్బంది ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్బంగా డిజిపి అంజనీ కుమార్ ప్రారంభోపన్యాసం చేస్తూ, పకడ్బందీ ప్రణాళిక, అమలు ద్వారానే తెలంగాణా రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే కాకుండా తొమ్మిదేళ్ల తెలంగాణా లో జరిగిన అభివృద్ధిలో పోలీస్ శాఖ పాత్ర కూడా ఎంతో ఉందని పేర్కొన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతర విధి నిర్వహణ ద్వారా వత్తిడికి గురవుతారని, ఆద్యాత్మికం ద్వారానే దీనిని అధిగమించవచ్చని తెలిపారు. మన దేశ సంస్కృతే మనకు గుర్తింపు తెచ్చిందని, ఈ పరంపరను కొనసాగించడంలో రామ కృష్ణ మఠం లాంటి సంస్థలు చేస్తున్న కృషి శ్లాఘనీయమన్నారు. చికాగోలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగంతో భారత గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేసిందనిపేర్కొన్నారు. వ్యక్తి తనను తానూ ఎలా నిర్బందించుకుంటున్నాడో, దాని నుండి ఎలా బయట పడాలనేదానిని తెలియచేస్తూ రామకృష్ణ మఠంఅధ్యక్షులు స్వామి బోధమయానంద ‘ఆధ్యాత్మికం ద్వారా ఆరోగ్యం ‘ అనే అంశంపై ప్రసంగించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ, యోగా అంటే కేవలం ధ్యానం మాత్రమే కాదని ఆత్మశుద్ధి కూడా ఉండాలని అన్నారు.

మానసికంగా, శారీరకంగా యోగా మనను బలోపేతం చేస్తుందని అన్నారు. ప్రస్తుత సమాజ పరిస్థితిల్లో మతం అనే దాని అర్థాన్ని చాలా ఆందోళకరంగా మార్చారని, ప్రధానంగా ఆంగ్లంలో దీనికి అపార్థం కలిగేలా అర్ధం వస్తోందని చెప్పారు. మతం అంటే భారతీయ భాషల్లో తత్వం, ధర్మం అనే అర్థమని వివరించారు. అయితే, ప్రతీ మతంలోనూ వ్యత్యాసాలున్నాయని, వీటిలో ట్రూత్ అనేది తత్వమని విపులీకరించారు. ప్రతి అధికారి తన విధి నిర్వహణలో ఎంత ఒత్తిడితో ఉన్నా, రోజుకు కనీసం ఒక అరగంటైనా ఆధ్మాత్మికతో గడపాలని సూచించారు. మిమ్ముల్ని మీరు తెలుసుకోవడంతోపాటు మరొకరికి పకృతి తత్వం గురించి తెలియచేయాలని తెలిపారు. ఈ సమావేశానికి అడిషనల్ డిజి మహేష్ భగవత్ స్వాగతం పలుకగా అభిలాష బిస్త్ వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా స్వామి బోధమయానందను డిజిపి అంజనీకుమార్ జ్ఞాపికతో సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News