Saturday, December 21, 2024

యాదాద్రిలో ఘనంగా ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

యాదాద్రిలో ఘనంగా ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలు
2043 ఆలయాలకు దూప దీప వైవేద్య పథకాన్ని ప్రారంభించిన
మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట వ్రత మండపంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకల్లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త్గా 2,043 దేవాలయాల్లో దీప, దూప నైవేద్య పథకాన్ని అమలు చేసిన అందుకు సంబంధించిన పత్రాలను అర్చకులకు అందచేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో మనమందరం చూస్తూనే ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తుందన్నారు. ఆద్యాత్మిక చింతన కలిగిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంత సాంప్రదాయలకు ,ఆలయాలకు, పండగులకు, వేడుకలకు అత్యంత ప్రాధాన్యత కల్పించడంతో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడుతోందన్నారు. స్వపరిపాలనలో తెలంగాణ స్వంత అస్థిత్వంతో కూడిన ఆధ్యాత్మిక శోభను సంతరించకుందన్నారు.

ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం ఆధ్యాత్మికంగా నిరాధారణకు గురైందన్నారు. సమైక్య రాష్ట్రంలో కేవలం 1805 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం అమలు చేస్తే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గారు 6,641 ఆలయాలకు ఈ పథకాన్ని విస్తరించారని, దీంతో అర్చకుల జీవన విధానంలో ఎంతో వృద్ధి కనపడుతుందన్నారు. ధూప దీప నైవేద్య పథకం ద్వారా అర్చకుల వేతనాలను రూ.6,000 నుంచి రూ.10,000 లకు పెంచుతామని సిఎం కెసిఆర్ నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలోనే అత్యంత పురాతన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో పునర్‌నిర్మించినట్లు చెప్పారు. దక్షణ కాశిగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు విటిడిఎ 35 ఎకరాల భూమిని సేకరించామని ఇప్పటికే రూ.70 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

అంతే కాకుండా వేముల వాడ అభివృద్ధికి రూ.50 కోట్లు, యాదాద్రి అభివృద్ధికి రూ.500 కోట్లను సిఎం కెసిఆర్ మంజూరు చేసినట్లు చెప్పారు.కామన్ గుడ్ ఫండ్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా అనేక ఆలయాలను అభివృధ్ధి చేసుకోవడమే కాకుండా అర్చకులకు, ఆలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలను చెల్లిస్తున్నట్లు తెలిపారు. భక్తుల వసతుల కల్పన కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, వీటిలో భాగంగా ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని,అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చేసిన సిఎం కెసిఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ మూడవసారి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News