హైదరాబాద్: మేడ్చల్ దేవరయాంజల్ భూములపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇచ్చింది. మొత్తం 1350 ఎకరాలు దేవాయానికి చెందినవేనని కమిటీ తేల్చింది. భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేశారని కమిటీ నివేదికలో పేర్కొంది. నిర్మాణాలను తొలగించి భూములు స్వాధీనం చేసుకోవాలని తెలిపింది.
దేవరయాంజాల్‌లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున పేరిట ఉన్న గోదాములను పరిశీలించి వివరాలు సేకరించారు. 1,425 ఎకరాల దేవరయాంజాల్ శ్రీ సీతారామ స్వామి ఆలయ భూములలో భారీ ఎత్తున చేపట్టిన గోదాంలు, ఫౌల్టీ ఫారాలు, ఫాంహౌస్‌ల నిర్మాణాలు, వీటికి బ్యాంకుల ద్వారా పొందిన రుణాల వివరాలను బయటకు తీశారు. భూముల రిజిస్ట్రేషన్లు, నిర్మాణ అనుమతులు తదితర అంశాలపై ఉన్నతాధికారుల బృందం విచారణలో బయటకు తీసింది. దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ధర్మకర్తలు, అర్చకులను, పలువురు గ్రామస్తులను విచారించి వందల ఎకరాల ఆలయ భూములు ఏ విధంగా రికార్డులు మారాయనే విషయాలపై ఆరా తీసి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.