Friday, November 8, 2024

విచారణ పూర్తయ్యాకే చర్యలు

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మన తెలంగాణ ఎడిటర్ ముఖాముఖి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిపాలనా పగ్గాలు చేపట్టి 11నెలలు పూర్తి చేసుకొని 12వ నెలలోకి అడుగుపెట్టారు. ఆయన పాలనకు డిసెంబర్ 7వ తేదీ నాటికి ఏడాది పూర్తి కానుంది. నవంబర్ 8వ తేదీ రేవంత్‌రెడ్డి పుట్టినరోజు. మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రను శుక్రవారం తన జన్మదినోత్సవం సందర్భంగా చేపట్టబోతున్నారు. ఈ ప్రత్యేకతల నేపథ్యంలో సిఎం రేవంత్‌రెడ్డి మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్‌కు 11 నెలల పాలనపై ఇచ్చిన ఇంటర్వూ విశేషాంశాలు

దర్యాప్తు లేకుండా చర్యలు చేపడితే రాజకీయ కక్ష సాధింపు అంటారు
హైడ్రాపై వెనక్కి తగ్గలేదు
11వేల అక్రమ కట్టడాలను నోటిఫై చేస్తాం
ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం
ఆదాయానికి, ఖర్చుకు తేడా రూ.12వేల కోట్లు
రూ.30వేల కోట్ల ఆదాయం ప్రతి నెల వస్తేనే
బండి సాఫీగా సాగుతుంది
అధికారంలో ఉంటే ఎంజాయ్ చేస్తా.. లేదంటే
మీ చావు మీరు చావండి అనేది కెసిఆర్ పాలసీ
రాహుల్ గాంధీ అధికారంలో లేకపోయినా
11 ఏళ్లుగా జనంలోనే ఉంటున్నారు
పొంగులేటి బాంబుల సందర్భం తెలియదు..
కానీ అవినీతిపై నిరూపణ తరువాత శిక్ష తప్పదు
సిఎం మారబోతున్నారన్నది బిజెపి
మహేశ్వర్‌రెడ్డి కోరిక కావొచ్చు
గాంధీ కుటుంబ విధేయుల్లో ముందు
వరుసలో నాపేరు
మూసీ పునరుజ్జీవం కాళేశ్వరంలా జరగదు
నా ప్రణాళిక వచ్చే నాలుగేళ్లకు కాదు.. తొమ్మిదేళ్లకు
మన తెలంగాణ దినపత్రిక ఎడిటర్
దేవులపల్లి అమర్‌కు ఇచ్చిన ప్రత్యేక
ఇంటర్వూలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ప్రశ్న : రాహుల్‌గాంధీ మీతో ఎందుకు ఎడమొహం…పెడమొహంగా ఉంటున్నారు ? మహేశ్వర్‌రెడ్డి (బిజెపి నేత) ఆరు నెలల్లో సిఎం మారబోతున్నారని అంటున్నారు.?

సిఎం : రాజకీయాల్లో ఎప్పుడూ ఒక మసాలా జోడిస్తుంటారు. ఒక సీనియర్ జర్నలిస్టుగా మీరు చెప్పండి. ఆయన లాంగ్వేజ్‌లో కానీ, బాడీ లాంగ్వేజ్‌లో కానీ, మాటల్లో కానీ మీకు అలా అనిపించిందా. మహేశ్వర్‌రెడ్డికి కోరిక ఉండవచ్చు…అలా జరగాలని. దానికి మేమేం చెబుతాం. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. గాంధీ కుటుంబంలోని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పట్ల విధేయతలో కానీ, కమిట్‌మెంట్‌లో కానీ ఓ ఐదుగురు పేర్లు రాయాల్సి వస్తే అందులో రేవంత్ రెడ్డి పేరు మొదట ఉంటుంది.

ప్రశ్న : హైడ్రాపై మెల్లమెల్లగా వెనక్కు తగ్గినట్లు అనిపిస్తోంది ?

సిఎం : అలాంటిదేమీ లేదు. మేం ఒక పద్ధతి ప్రకారం వెళుతున్నాం. 11వేల పైగా అక్రమ నిర్మాణాలు కోర్ అర్బన్ రీజియన్‌లో ఉన్నాయని గుర్తించాం. ఔటర్ రింగ్ రోడ్‌ను కటాఫ్ పెట్టుకుని నోటిఫై చేస్తున్నాం. వీటన్నింటినీ ఒక సింగిల్ యూనిట్‌గా తీసుకువస్తున్నాం. ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా మేం నోటీసు ఇవ్వలేం..కూల్చలేం. కెటిఆర్ అతి తెలివి చూడండి. హిమయత్‌సాగర్‌కు కనీసం నోటిఫై కూడా చేయలేదు. మరి అలా చేయకుండా వివేక్, కెవిపి రామచంద్రరావువి ఎందుకు కూల్చడం లేదని కెటిఆర్ అతి తెలివితో మాట్లాడుతున్నారు. నోటిఫై చేయకుండా అక్రమ నిర్మాణం అని ఎలా చెబుతాం. వీటన్నింటికీ సంబంధించి ఒక చట్టం కిందకు తీసుకువచ్చి నోటిఫై చేసే పనిలో ఉన్నాం.

ప్రశ్న : ప్రభుత్వం మీద ఒక ఆరోపణ ఉంది…11 నెలలుగా గత ప్రభుత్వంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడం తప్పించి ఏం చేయడంలేదనే విమర్శ ఉంది.?

సిఎం : మేం అధికారంలోకి రాగానే కాళేశ్వరం, పవర్ ప్రాజెక్టులు, టెలిఫోన్ ట్యాపింగ్, ఈ రేస్ వీటన్నింటిపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వాలని చీఫ్ జస్టిస్‌ను అడిగాం. కానీ సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేం. రిటైర్డ్ జడ్జిని కేటాయిస్తామన్నారు. వారితోనే మేం కమిషన్లను ఏర్పాటు చేశాం. కమిషన్లు రిపోర్టు సమర్పించకుండా ఏ విధంగా చర్య తీసుకోగలుగుతామో మీరే చెప్పండి. ఒక వేళ వెంటనే తీసుకున్నామనుకోండి. అప్పుడు నన్ను (రేవంత్‌రెడ్డి) జైలుకు పంపించారు కనుక రాజకీయ కక్షసాధింపుతో పగ బట్టి ఇదంతా చేస్తున్నారని అంటారు కదా. అంతెందుకు ధరణి ఉంది. అది కెటిఆర్‌కు సంబంధించిన ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ధరణిపై వెంటనే చర్య తీసుకోవాలని మేం అనుకుంటే ఆ ప్రైవేటు వ్యక్తి మొత్తం రికార్డులనే ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. అలా కాకూడదనే మేం దానిని ఎన్‌ఐసికి అప్పగించాం. కాళేశ్వరం, పవర్ ప్రాజెక్టులు, టెలిఫోన్ ట్యాపింగ్, ఈరేసింగ్.. వీటన్నింటిపై ఓ పద్ధతి ప్రకారం విచారణలు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు మేం చర్యలు తీసుకోలేం కదా.

ప్రశ్న: పదకొండు నెలల మీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఎటువంటి అనుభవాన్ని పొందారు? రాజకీయ పార్టీలు ఏదో అంటుంటాయి.. నేను వాటి జోలికి వెళ్లడం లేదు.. తెలిసి మీ ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాలేదు కదా?

సీఎం: కేసీఆర్ హయాంలో అడ్మినిస్ట్రేషన్ అనేది కుప్పకూలిపోయింది. అది ఒక్కటే కాదు వ్యవస్థలు అన్నింటినీ ఆయన కుప్పకుల్చారు. వ్యక్తి కేంద్రంగా నిర్ణయాలతో ప్రభుత్వం నడిచింది. విధాన నిర్ణయాలు కూడా ఒక్కరే తీసుకునేవారు. 29 డిపార్టుమెంట్స్ ఉంటే వాటిని గాలికి వదిలేసి కేవలం నాలుగైదు సెలక్టెడ్ డిపార్టుమెంట్లను, ఫైళ్లను రివ్యూ చేయడం తప్ప మిగతా వాటిని పట్టించుకునేవారు కాదు. ఆధికారుల్లో కూడా నలుగురైదుగురిని తప్ప మిగతా వారిని ఐడియల్‌గా పెట్టారు. మేము అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ పునరుద్ధరించి పోస్టింగ్‌లు ఇచ్చే లోపలే ఎన్నికల కోడ్ వచ్చింది. దీని వల్ల అన్నింటినీ మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. దాని వల్ల నాలుగైదు నెలలు గడిచిపోయింది. ఆ తర్వాత మళ్లీ పోస్టింగ్‌లు ఇచ్చి బ్యూరోక్రసీని ఒక గాడిలో పెడదామనుకునే లోపల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేడర్ సమస్య వచ్చింది. బ్యూరోక్రసీ ఒక గాడిలో పెడదామనుకునే ప్రతిసారీ ఏదో ఒక ఆటంకం ఎదరవుతూనే వచ్చింది. దీని వల్ల మా ప్రభుత్వం ఒక ఇమేజ్ బిల్డింగ్‌ను చేసుకోలేక పోయింది. మేము అధికారంలోకి వచ్చాక విధాన నిర్ణయాలపైన కానీ, రివ్యూలపైన కానీ ఒక్క సింగిల్ ఆఫీసర్ కూడా ఖాళీగా లేడు.

అందరికీ పోస్టింగ్‌లు ఇచ్చాం. కేసీఆర్ హయాంలో 2019 అనుకుంటా 17 మంది ఐఏఎస్, ఐపిఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా రెండున్నరేళ్లు ఖాళీగా కూర్చోబెట్టారు. మేము అధికారంలోకి వచ్చాక సివిల్ సర్వీసెస్ అధికారులు మొదలుకుని గ్రూప్ వన్ ఆఫీసర్స్ వరకు వారి పనితీరును బట్టి ఏ,బి,సి మూడు కేటగిరీలుగా విభజించాం. ఏ క్యాటగిరీ వారు అంటే 360 డిగ్రీస్. హానెస్ట్, ఇంటిగ్రిటీ, హార్డ్ వర్క్, కమిట్‌మెంట్ ఉన్నవారు, బి క్యాటగిరీ వారు మధ్యస్థం. వీరిలో హార్డ్ వర్క్‌తో పాటు కొంత కరప్షన్ కూడా ఉంటుంది. ఇక సీ క్యాటగిరీ వారు మనం చెప్పినా మారనోళ్లు…తోలు మందం అయినవారు. వారు ఎవరు చెప్పినా మారరు. ఏ కేటగిరీ వారికి హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్స్‌గా చేశాం. జిల్లా స్థాయిలో అయితే కలెక్టర్, ఎస్సీలుగా పోస్టింగ్‌లు ఇచ్చినం. బి కేటగిరీ వాళ్లను ఏ కేటగిరీ వారి కింద పని చేసేలా పోస్టింగ్‌లు ఇచ్చాం. కీలకమైన శాఖలు, పన్నుల వసూళ్లు తదితర కీలకమైన పదవులను ఏ కేటగిరీ వారికి అప్పగించాం.

ప్రశ్న: బిఆర్‌ఎస్ హయాంలో వేల ఫైల్స్ పెండింగ్‌లో ఉండేవని, సిఎం సెక్రటరియేట్‌కు రాకపోవడంతో పెండింగ్ ఫైల్స్ రూమ్‌లకు రూమ్‌లు నిండిపోయేవని బ్యూరోక్రాట్సే చెప్పేవారు. వాటన్నింటినీ మీరు ఏ విధంగా పరిష్కరించారు?

సీఎం: ఒక్క డిపార్ట్‌మెంట్ అని కాదు…అన్ని శాఖల్లో అదే పరిస్థితి. ఫైళ్లు పెండింగ్‌లో ఉండడం సమస్య కాదు..వాటి కాలపరిమితి తీరిపోయింది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి గొర్రెల పెం పకానికి సంబంధించిన ఓ పథకం ఉంది. దీనికి కేంద్రం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ తెచ్చుకోవాలి. అలాగే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎమ్) ఉంది.. దీనికి రూ.5వేల కోట్లు కేటాయించే వెసులుబాటు ఉంది. మొదటి సంవత్సరం రూ.5 వేల కోట్లు కేటాయించినప్పటికీ రూ. 500 కోట్లు మాత్రమే వినియోగించుకోవడం వల్ల దానిని మరుసటి సంవత్సరం రూ.4,500 కోట్లకు కుదించారు. మరో సంవత్సరానికి వచ్చే సరికి రూ. 400 కోట్లు మాత్రమే వినియోగించుకున్నారు. దీని వల్ల అది మరింత దిగజారి రూ. 3,500 కోట్లకు చేరింది. ఈ విధంగా చేయడం వల్ల చివరకు రూ.5000 కోట్లు రూ. 3000 కోట్లకు తగ్గుతూ వచ్చింది. వారి ఉద్దేశ్యంలో మీరు ఉపయోగించుకునే ఉద్దేశ్యమే లేదన్న అభిప్రాయానికి తీసుకువచ్చారు. కేంద్రం ఒక రాష్ట్రానికి రూ.1000 కోట్లు ఇచ్చిందంటే దానిని మొదటి త్రైమాసికంలోనే రూ.500 కోట్లు ఖర్చు పెడితే రెండో త్రైమాసికానికి మిగతా రూ. 500 కోట్లు కేటాయిస్తుంది. నూటికి నూరు పాళ్లూ ఖర్చు పెడితే రాష్ట్రానికి ఏటేటా నిధులను పెంచుతారు. వినియోగించుకోని పక్షంలో తగ్గించే అవకాశం ఉంటుంది. ఇది కేంద్రం విధానం.

కేంద్ర నిధుల కేటాయింపుల్లో నా ఉద్దేశ్యంలో రాజకీయాల కంటే ఆన్‌లైన్‌లో ఒక పద్థతి ప్రకారం వారు అడిగిన వాటన్నింటినీ సమర్పిస్తే ఆ మేరకు నిధుల కేటాయింపు జరుగుతుంది. కానీ గత ప్రభుత్వంలో వాటిని ఏవీ పట్టించుకోకుండా వదిలేయడం వల్ల అసలే కేటాయింపులే జరగని పరిస్థితి ఏర్పడింది. అయితే కెసిఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని, లేకుంటే కాళేశ్వరానికి ఇవ్వాలని, జాతీయ హోదా ఇవ్వాలంటూ రాజకీయ కామెంట్లు చేసేవారు తప్ప అసలు కేంద్రంలో 2015 నుంచి అలాంటి కాన్సెప్టే లేదు. హెచ్‌ఎస్‌సీ విధానం రద్దుయిపోయి ఎస్‌ఎస్‌సీ అని వచ్చాక కూడా మనింట్లో ఒకాయన హెచ్‌ఎస్సీ పరీక్ష రాస్తా అన్నట్లు కెసిఆర్ వైఖరి ఉండేది. కేసీఆర్ జాతీయ ప్రాజెక్టు కావాలన్న డిమాండ్ కూడా అదే పద్ధతిలో ఉండేది.

ప్రశ్న: కేంద్రం నుంచి నిధులు తీసుకోవడానికి అలాంటి వెసులుబాటు ఏమైనా ఉందా?

సీఎం: కేంద్రం నిబంధనల రూపకల్పన మేరకు మేము 60 శాతం భరిస్తాం. మిగతా 40 శాతం మీరివ్వండి.. వారి ఫార్మాట్‌లో నిధు లు వచ్చే అవకాశం లేకపోలేదు. మేం అధికారంలోకి వచ్చాక ఈ రకంగా ఇవ్వాలని

ప్రశ్న : డీ లిమిటేషన్‌లో జనాభా ప్రాతిపదికన తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని గతంలో మీరన్నారు. అలాంటి పరిస్థితి వస్తే కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమానికి మీరే నేతృత్వం వహిస్తానన్నారు కదా ?

సీఎం: కాంగ్రెస్ పార్టీ జాతీయ విధానం సోషల్ జస్టిస్ రిలీజియన్…రీజియన్ ఆల్. కానీ వీటికి అన్యాయం జరుగుతోంటే తమ పార్టీ చూస్తూ ఊరుకోదు. జనాభా ప్రాతిపదికన ఉత్తరాదిలో ఎంపి సీ ట్లు పెంచుకుంటాం. దక్షిణాదిలో తగ్గిస్తాం అంటే ఏ విధంగా సమర్థిస్తాం. దీనిని కాంగ్రెస్ పార్టీ చూ స్తూ ఊరుకుంటుందా. నార్త్‌లో గాంధీ ఫ్యామిలీ పోటీ చేస్తే గెలవలేదని, సౌత్‌లో పోటీ చేస్తే గెలుస్తారనే వారు. మరి ఇప్పుడు నార్త్‌లో కూడా గెలిచి చూపించారు కదా. కాంగ్రెస్ పార్టీకి దేశమంతా ఒ కటే. ఇందులో నార్త్, సౌత్ అన్న వివక్ష లేదు. డీ లిమిటేషన్ అన్నది ఒక్క సీట్ల వరకు పరిమితమయ్యేది కాదు.. కేటాయించే నిధులతో కూ డా ముడిపడి ఉన్న సమస్య. జనాభా ప్రాతిపదికన నే ఇది జరుగుతుందంటే సౌత్ తీవ్రంగా నష్టపోతుంది.

మనం (సౌత్) కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పి లుపు మేరకు కుటుంబ నియంత్రణ పాటించాం. వాళు ్ల (నార్త్) పాటించలేదు. వారి ఆదేశాలను పా టిస్తే పనిష్మెంట్ విధానం ఎంతవరకు సమంజసం. వారి విధానం చూస్తే పాటించని వారిని ప్రశంసిస్తున్నట్లుగా ఉంది. జనాభా ప్రాతిపదికనే ఎక్కువ నిధు లు.. ఎక్కువ సీట్లు.. ఇదెక్కడి న్యాయం. ఒక్క రూ పాయి మనకు కేంద్రం ఇస్తే వారి నుంచి మనకు వచ్చేది 40 నుంచి 42 పైసలు. అదే యుపి అయితే 70 పైసలు వస్తాయి. బీహార్‌కు 6 వస్తాయి. ఇదేమంటే జనాభా ప్రాతిపదికన అంటున్నారు. దీనిని ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారు.

ప్రశ్న : మరి ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి ఎవరు నడుంబిగిస్తారు ? కొన్ని రాజకీయ కారణాల వల్ల కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి ముందుకు రాకపోతే నేనే నాయకత్వం వహిస్తానని ఈ మధ్య మీరు ఓ ఇంటర్వూలో చెప్పారు కదా ?

సీఎం: ఈ అంశంలో సీనియర్లు ముందుకు తీసుకువెళితే నేనే వారికి మద్దతు ఇస్తాను. సీనియర్లకు ఉండే అనుభవం, వారికి ఉండే ఇమేజ్ దృష్టా వారు చేస్తేనే మంచిదనేది నా అభిప్రాయం. వారు ముందుకు రాని పక్షంలో నేను లీడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మొన్న ఈమధ్య ఫైనాన్స్ కమిషన్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. మెరిట్ బేసిస్‌లో నిధుల పంపకం ఉండాలని కోరాను. అలా కాకపోతే ఏదో ఒక రూపంలో అశాంతికి దారి తీస్తుంది. జనాభా ప్రకారమే డీ లిమిటేషన్ జరిగితే సౌత్‌లో వచ్చే సీట్లతో ప్రమేయం లేకుండానే నార్త్‌లో వచ్చే సీట్లతోనే ప్రధాని ఎన్నికవుతారనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఎంపీ స్థానాలు 800 సీట్లకు పెరుగుతాయని అంటున్నారు కదా.. అలా జరిగితే 300 సీట్లు నార్త్‌లోనే పెరుగుతాయి.

సౌత్ నుంచి ఒక్క సీటు కూడా పెరగదు. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఒక విధానాన్ని అనుసరించేవారు. అది ఒక జెంటిల్‌మెన్ అగ్రిమెంట్. నార్త్ నుంచి ప్రధాన మంత్రి ఉంటే సౌత్ నుంచి రాష్ట్రపతి ఉండేవారు. అలాగే సౌత్ నుంచి ప్రధాన మంత్రి ఉంటే నార్త్ కు రాష్ట్రపతి అవకాశం ఇచ్చే విధానం ఉండేది. బిజెపి ప్రభుత్వం వచ్చాక సౌత్‌కు ఏమైనా ఇచ్చారా ? రాష్ట్రపతి వారే.. ప్రధా ని వారే.. అంతెందుకు.. ఇప్పుడు కేంద్రంలో మం త్రివర్గాన్ని తీసుకుంటే టాప్ టెన్‌లో సౌత్ నుంచి ఎంతమంది ఉన్నారు. ప్రధాని..రాష్ట్రపతి.. వారే.. లోక్‌సభ స్పీకర్.. శాఖ మంత్రి కూడా వారే క దా. సౌత్ పట్ల బిజెపి నిర్లక్షం భరించలేని స్థాయికి చేరుకుంది. భవిష్యత్‌లో ఇది అసహనానికి దారి తీసే ప్రమాదం ఉంది. వారు చేసే నిర్లక్షానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అదెప్పుడనే ది చెప్పలేం. కానీ ఎప్పుడో అప్పుడు జరుగుతుంది.

ప్రశ్న: విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై జస్టిస్ లోకూర్ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం ఏం చేయబోతోంది?

సీఎం: ఆయన తన నివేదికను ప్రభుత్వానికి ఇ చ్చారు. అది కేబినెట్ ముందుకు రావాల్సి ఉంది. అప్పుడు చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

ప్రశ్న: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ నివేదిక ఈ మధ్యలో ఏమైనా వస్తుందా?

సీఎం: ఇంకా ఆయన డెసిషన్ మేకర్స్‌తో విచారణ జరపాల్సి ఉంది. దాని తరువాత ఇవ్వవచ్చు. ఇప్ప టి వరకు అధికారులను మాత్రమే విచారించారు. నిర్ణయాలు ఎవరు తీసుకున్నారన్నది డెసిషన్ మేక ర్స్ నిర్ధారించాల్సి ఉంది.

ప్రశ్న: మల్లికార్జున ఖర్గే బడ్జెట్ ప్రణాళిక లేకుండా ఉచితాలు ఇవ్వడం పట్ల చేసిన వ్యాఖ్యలపై ఏమంటారు?

సీఎం: ఏ అంశాన్నయినా మనం నెగెటివ్‌గా తీసుకోవచ్చు.. పాజిటివ్‌గా తీసుకోవచ్చు. ఆయన చెప్పి న దాంట్లో నెగటివ్‌గా నేను అనుకోవడంలేదు. అ పారమైన రాజకీయ అనుభవంతో ఆ మాట అని ఉండవచ్చు. కానీ నెగెటివ్ కాదు.. కానీ బిజెపి వాట్సప్ యూనివర్సిటీ దానిని చిలవలు ప లువలు చేస్తోంది. ఆయన అనుభవాన్ని ఒక సలహా కింద తీసుకోవాలి. అంతెందుకు.. యాభై ఏళ్ల అనుభవంలో ఎంతో మంది సీఎంలను చూసి ఉంటారు. నాలాంటి వారు ఫస్ట్ సీఎం అయిన వా రికి మీరిచ్చే హామీలు బడ్జెట్ చూసుకుని చేయమని సలహా ఇచ్చారనుకోండి. దానిలో తప్పేముంది. రా జకీయాల్లో ప్రతి దానినీ వివాదం చేయాలనుకునే వారికి మనమేం చెబుతాం. పెద్దలు చెబుతారు క దా…పిండిని బట్టే రొట్టె ఉండాలని..ఆయన చెప్పినదాంట్లో తప్పేమీ లేదు.

devulapalli amar interview with cm revanth reddy

ప్రశ్న: ఎన్నికల్లో మీరిచ్చిన హామీల్లో ఇవి చేయకుండా ఉండాల్సింది అని మీకేమైనా అనిపించిందా?

సీఎం: నాకేం అనిపించలేదు. కానీ ఒక్క విషయం లో మాత్రం ఆశ్చర్యపోయాను. అదేందంటే కెసిఆర్ మనల్ని మూడున్నర లక్షల కోట్ల అప్పులు చేశామ ని నమ్మించారు. కానీ అది ఏడున్నర లక్షల కోట్లు అన్నది మేం వచ్చిన తరువాత బయటపడింది. ఈ ఒక్క విషయంలో మాత్రం ఆశ్చర్యానికి గురయ్యా ను. ఆ దెబ్బ వల్ల మేం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ప్రతి నెలా రూ. 6500 కోట్లు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్‌లకే ఖర్చు పెడుతున్నాం. మరో రూ. 6500 కోట్లు ప్రతి నెలా కెసిఆర్ చేసి వె ళ్లిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నాం. ఇక్కడి వరకే 13వేల కోట్ల వరకు అయింది. ఆన్ గోయింగ్ సం క్షేమ పథకాలు కానీ, మేం ఇచ్చిన హామీలు కానీ మరో రూ. 10వేల కోట్లు అవసరం. ఇవన్నీ కలిపితే రూ. 23వేల కోట్లు ప్రతి నెలా అవసరం. అలాగే కెసిఆర్ 53 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టి వెళ్లారు. వాటికి కూడా దశలవారీగా నెలకు 7వేల కోట్లు చెల్లించినా ప్రతి నెలా 30వేల కోట్లు అవస రం అవుతాయి.

కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆ దాయం రూ. 18,500 కోట్లు మాత్రమే. ప్రాధాన్య తా క్రమంలో 23వేల కోట్లు తప్పనిసరిగా చెల్లించా ల్సి వస్తోంది. అలా చేసినా కూడా ప్రతి నెలా 4వేల కోట్లు లోటు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఇందుకోసం మేం జనవరి 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు చె ల్లిస్తూ ప్రభుత్వం అందించే పెన్షన్లు, ఫీజు రీయంబర్స్‌మెంట్ కాస్త అటూ ఇటూ చెల్లిస్తూ నెట్టుకొస్తు న్నాం. మేము సాఫీగా ప్రభుత్వాన్ని నడిపించడాని కి రూ. 30 వేల కోట్లు అవసరమవుతాయి. కానీ వస్తున్న ఆదాయం 18 వేల కోట్లు మాత్రమే. మరో 12 వేల కోట్లు వస్తే కానీ బండి సాఫీగా ముందుకు పోదు. ఇదిలా ఉండగా మేమిచ్చిన హామీ మేరకు రైతులకు రూ.18వేల కోట్ల రుణ మాఫీ చేశాం. వీ టి కోసమని మా ప్రభుత్వం ఒక్క ఇంచు భూమి కూడా అమ్మలేదు. మహిళలకు ఉచిత బస్సు సౌక ర్యం, 200 యూనిట్లకు ఉచితంగా గృహ విద్యుత్ ఇస్తున్నాం. రూ.500 కే సిలిండర్ అర్హులైన వారందరికీ ఇస్తున్నాం. రూ. 10లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమాను అమలు చేస్తున్నాం. ఉద్యోగులకు డిఏ ఇ చ్చాం. ప్రతి నెలా మొదటి తేదీన జీతాలు ఇస్తు న్నాం. షాదీ ముబారక్, పాత పెన్షన్లు ఇస్తున్నాం.

ప్రశ్న: మరి రుణమాఫీ 2 లక్షలపైగా ఉన్నవారికి రాలేదు కదా?

సీఎం: మా కమిట్‌మెంట్ రెండు లక్షల వరకు మా త్రమే రుణమాఫీ చేస్తామన్నాం. మా మేనిఫెస్టో చదవండి. అయినప్పటికీ 2లక్షలకు పైగా రుణం తీసుకున్నవారికి కూడా చెల్లిస్తామని చెప్పాం. చెల్లిస్తాం కూడా. కానీ ఆ పైన ఉన్న దాన్ని మొదటి వారు చెల్లించాలని కండిషన్ పెట్టాం.

ప్రశ్న: మరి రైతులు మీరు చెల్లించాల్సింది చెల్లిస్తే మిగతాది మేం కట్టుకుంటామంటున్నారు కదా?

సీఎం: అదెలా కుదురుంది. మేం ఇచ్చిన హామీ రూ.2లక్షలు మాత్రమే. మేం 10 లక్షలు అప్పు చేశాం కట్టమంటే ఎలా సాధ్యమవుతుంది.

ప్రశ్న: మీరు ఇన్ని లెక్కలు చెప్పారు. ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే లక్షా యాభై వేల కోట్ల మూసీ ప్రాజెక్టు ఎందుకు చేపట్టారు?

సీఎం: ఎవరు చెప్పారు.. యాభైవేల కోట్లని. లక్షా యాభై వేల కోట్లు కాళేశ్వరం కోసం వారు ఖ ర్చుచేసి లక్షా యాభై వేల కోట్లు మూసీ ప్రాజెక్టు కో సం ఖర్చు చేస్తున్నామని మాపై రుద్దుతున్నారు. దీ ని విషయంలో పిపిపి మోడ్‌లో వెళ్లాలా? ఇంటిగ్రేటెడ్ మోడ్‌లో వెళ్లాలా అని ఆలోచిస్తున్నాం. ఇంతవరకూ అంచనా వేయలేదు. దుబాయ్‌లో, సింగపూర్‌లో, బుర్జ్ ఖలీఫా, సింగపూర్ సిటీ, స్టాచ్యూ ఆ ఫ్ లిబర్టీ ఇలాంటి సుప్రసిద్ధమైన వాటిని నిర్మించిన కన్సల్టెంట్‌తో అప్పగించి ఏ విధంగా ముందుకు తీ సుకెళ్లాలన్నది ఆలోచిస్తున్నాం. వాళ్లలా కట్టింది.. దానికి డిపిఆర్ లేదు. మేం అ లా చేయం. ప్రపంచంలో ఐదు అద్భుతాలను సృ ష్టించిన కంపెనీలతో కన్సార్టియం ఏర్పాటు చేశాం.

ప్రశ్న: వచ్చే నాలుగేళ్లలో మీ ప్రాధాన్యతా కార్యక్రమాలేమిటి?

సీఎం: నాలుగేళ్లకు కాదు.. ప్లాన్ తొమ్మిదేళ్లకు. ఇప్పుడు అమలు చేస్తున్న వాటిని అమలు చేస్తే సరిపోతుంది. కానీ మేం భవిష్యత్ తరాల గురించి ఆ లోచిస్తున్నాం. క్లైమేట్ ఛేంజ్ గురించి ఆలోచిస్తు న్నాం. నీళ్లుండాల్సిన చోట మనుషులున్నారు. మ నుషులు ఉండాల్సిన చోటకు నీళ్లు వస్తున్నాయి. ఈ పరిస్థితి రాకూడదనే సంస్కరణల ఆలోచనతో ముం దుకెళ్తున్నాం. కొన్ని సంస్కరణలతో ముందుకెళ్తున్నపుడు కొన్ని వివాదాలు రావడం మామూలే. హైడ్రా ఫుల్ ఫాం తెలియక పోయినా కొన్ని రాష్ట్రాలు మేం హైడ్రా ఏర్పాటు చేసుకుంటామని అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News