Saturday, November 23, 2024

గోఫస్ట్ విమానాల ఇంజన్లలో లోపాలు.. డిజిసిఎ దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాల ఇంజన్లలో లోపాలు తలెత్తాయి. మంగళవారం ముంబై నుంచి లెహ్‌కు బయల్దేరిన విమానంతోపాటు శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళుతున్న విమానం ఇంజన్లలో సమస్యలు తలెత్తాయి. ఎ320 నియో విమానాలు రెండింటిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు డిజిసిఎ తెలిపింది. ప్రాట్, వైట్నీ ఇంజన్లతో నడిచే ఈ రెండు విమానాలలో తలెత్తిన లోపాలపై దర్యాప్తు జరిపిన తర్వాత ఇవి ప్రయాణించడానికి అనుమతి ఇస్తామని డిజిసిఎ అధికారులు తెలిపారు. ఈ రెండు విమానాలకు చెందిన రెండవ ఇంజన్‌లోనే లోపాలు తలెత్తినట్లు అధికారులు తెలిపారు. ముంబై నుంచి లెహ్‌కు వెళుతున్న విమానాన్ని ఢిల్లీకి మళ్లించినట్లు అధికారులు చెప్పారు. అదే విధంగా శ్రీనగర్ నుంచి ఢ్లికి బయల్దేరిన విమానం మధ్యలోనే శ్రీనగర్‌కు తిరిగివచ్చినట్లు వారు చెప్పారు. కాగా..ఈ సంఘటనలపై గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

DGA Probe on Engine Snags of Go First plane

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News