న్యూఢిల్లీ: గుప్త క్షయవ్యాధిని గుర్తించడం కోసం సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ దేశీయంగా రూపొందించిన ‘సై టిబి’ కిట్‌కు జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ డిజిజిఐ మార్కెట్ అనుమతులు మంజూరు చేసింది. 18 ఏళ్ల అంతకు పైబడిన వయసు వారిలో గుప్తంగా దాగి ఉన్న క్షయవ్యాధిని గుర్తించడం కోసం చర్మ పరీక్షలు నిర్వహించడానికి ఈ కిట్‌ను ఉపయోగిస్తారు. కిట్‌పై ఈ సంస్థ నిర్వహించిన ప్రయోగాలను అధ్యయనం చేసిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా ఈ అనుమతి లభించింది. సోమవారం నాడు డిజిసిఐ ఈ ఆనుమతి మంజూరు చేసింది. ఈకిట్‌కు మార్కెట్ అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వ, రెగ్యులేటరీ వ్యవహారాల విభాగం డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ డిజిసిఐకి దరఖాస్తు చేశారు.ఈ కిట్‌ను రూపొందించడంలో పుణెకు చెందిన మైల్యాడ్ సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి పని చేసింది.