Monday, December 23, 2024

టికెట్ స్థాయి కుదిస్తే.. విమాన ప్రయాణికులకు డబుల్ డబ్బులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విమాన ప్రయాణికులకు ఓ కీలక వార్త. తాము బుక్ చేసుకునే టికెట్లు అనుకోకుండా స్థాయి తగ్గితే అటువంటి వారికి పరిహారం దక్కుతుంది. ఇది టికెట్ ధరలో రెండింతలుగా ఉంటుంది. సాధారణంగా విమాన ప్రయాణికులు క్లాసును ఎంచుకుని టికెట్లు బుక్ చేసుకుంటారు. కానీ ఏదో ఒక దశలో ఈ టికెట్ల డౌన్‌గ్రేడ్ జరిగితే ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ పరిణామాన్ని పరిగణనలోకి తీసుకుని అటువంటి ప్రయాణికులకు తగు పరిహారం ఇచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. విమాన ప్రయాణాల నియంత్రణ సంస్థ డిజిసిఎ సంబంధిత విషయాన్ని పరిగణనలోకి తీసుకుని నూతన నిబంధనలు రూపొందించేందుకు సిద్ధం అయింది.

టికెట్ డౌన్‌గ్రేడ్ జరిగితే సంబంధిత విమానయాన సంస్థ ఏదైనా సదరు ప్రయాణికులకు టికెటు ధర పూర్తి స్థాయిలో పన్నులు సహా చెల్లించాలి. బాధిత ప్రయాణికులు ఆ తరువాత అందుబాటులో ఉండే విమానాలలో, వారు నిర్ధేశించుకునే క్లాసులో ఉచితంగా వెళ్లేందుకు వీలు కల్పించాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో చాలా మంది విమాన ప్రయాణికులు తమ బుక్ అయిన టికెట్లకు సరిగ్గా విలువ నివ్వడం లేదని, పలు కారణాలతో వెళ్లే క్లాసులో వెళ్లాలని సూచిస్తున్నారని ఫిర్యాదులు చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు డిజిసిఎ తగు విధంగా నిబంధనలు మార్చేందుకు సిద్ధం అయింది. కొత్త నిబంధనలు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అమలులోకి వస్తాయని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News