- Advertisement -
న్యూఢిల్లీ : విమానాలు ఆలస్యమైన ప్రయాణికులకు నిబంధనల ప్రకారం సౌకర్యాలను ఏర్పాటు చేయనందుకు గాను ఎయిర్ ఇండియాకు డిజిసిఎ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నోటీసులు జారీ చేసింది. ఎయిర్ ఇండియాకు రూ.10 లక్షల జరిమానా విధించింది. ఒకటిన్నర సంవత్సరంలో ఇదే కారణం తో ఈ కంపెనీకి డిజిసిఎ నోటీసులు జారీ చేయడం ఇది రెం డోసారి. గతేడాది జూన్‌లో కూడా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను డిజిసిఎ ఎయిర్ ఇండియాపై రూ.10 లక్షల జరిమానా విధించింది. తాజా ఆదేశాల్లో డిజిసిఎ కూడా గత ఏడాది సూచనలను ఇంకా అమలు చేయలేదని పేర్కొంది.
- Advertisement -