Monday, December 23, 2024

ఎయిర్ ఏషియాకు రూ.20లక్షల జరిమానా

- Advertisement -
- Advertisement -

ముంబయి: భారత విమానయాన నియంత్రణ సంస్థ (డిజిసిఎ) ఏషియా విమానసంస్థకు రూ.20లక్షల జరిమానా విధించింది. అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ సంస్థ నడిపే పైలట్‌కు నిబంధనల ప్రకారం సామర్థ పరీక్షలు నిర్వహించాలి. అయితే ఎయిర్ ఏషియా పైలట్ శిక్షణలో నిబంధనలు విస్మరించ డంతో డిజిసిఎ విధించింది. విధుల నిర్వహణలో అలసత్వం వహించిన ఎయిర్‌లైన్స్ శిక్షణ విభాగ హెడ్‌ను మూడునెలలపాటు చేసింది. ఈక్రమంలో ఎనిమిదిమంది ఒక్కొక్కరికి జరిమానా విధిస్తున్నట్లు డిజిసిఎ పేర్కొంది.

సంబంధిత మేనేజర్, ట్రైనింగ్ హెడ్ తదితర అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. వారి లిఖితపూర్వక సమాధానాన్ని పరిశీలించి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. దీనిపై స్పందించిన ఎయిర్ ఏసియా ఆదేశాలపై అప్పీల్ చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. పైలట్స్ సిమ్యులేటర్ ట్రైనింగ్‌లో అన్ని నిబంధనలు పాటిస్తున్నట్లు ఎయిర్ ఏషియా అధికార ప్రతినిధి తెలిపారు. కాగా టాటా గ్రూప్ ఎయిర్‌లైన్‌పై నెలరోజుల వ్యవధిలోనే డిజిసిఎ చర్యలు తీసుకోవడం ఇది మూడోవసారి కావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News