Saturday, November 23, 2024

ప్రోటోకాల్స్ పాటించకపోతే గెటౌట్లే

- Advertisement -
- Advertisement -

dgca issues new guidelines for airlines

ముంబై: మాస్క్‌లు సరిగ్గా పెట్టుకోకుండా ఉండే వారిని వెంటనే విమానాల నుంచి దింపివేయాలని విమానయాన నియంత్రణ సంస్థ డిసిజిఎ ఆదేశించింది. ప్రయాణికులు అంతా ఖచ్చితంగా కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించి తీరేలా చూడాల్సి ఉందని విమాన సంస్థలకు శనివారం ఓ సర్కులర్‌లో తెలిపింది. పదేపదే ఉల్లంఘనలకు దిగితే వారిని విమాన డిబార్ జాబితాలో చేర్చాలని ఇందులో సూచించారు. దేశంలో పలు ప్రాంతాలలో కరోనా కేసుల ఉధృతి నేపథ్యంలో డిసిజిఎ స్పందించింది. కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించకుండా ఉండేవారిని, మాస్క్‌లు పెట్టుకున్నా, వాటిని సరిగ్గా అమర్చుకోకుండా ఉండేవారిని విమానాల నుంచి దింపివేయించి తీరాలని ఆదేశించారు.

ఇటువంటి ప్రయాణికులను అరాచకుల జాబితాలోపెట్టండని, ఈ విధంగా వారి తదుపరి ప్రయాణాలకు ఇబ్బంది ఏర్పడితే దారికి వస్తారని తెలిపింది. నిబంధనలు పాటించాలని పదేపదే హెచ్చరికలు జారీ చేసినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు డిసిజిఎ స్పష్టమైన హెచ్చరికలతో కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ప్రయాణికులు విమాన ప్రయాణం అంతా కూడా విధిగా మాస్క్‌లను సక్రమరీతిలో అమర్చుకోవాలి. నిర్థిష్టంగా భౌతికదూరాలను పాటించాలి. ఈ విషయాలను విమాన సిబ్బంది పర్యవేక్షించాల్సి ఉంటుంది. నిబంధనలను పాటించనివారిని దింపేయాల్సి ఉంటుందని సర్కులర్‌లో తెలిపారు. నియమావళిని రెండు మూడుసార్లు ఉల్లంఘించిన వారిని నో ఫ్లై జాబితాలో చేరుస్తారు. వారిని రెండేళ్లు, అంతకు మించి విమానాలలో తిరగనివ్వకుండా చర్యలు తీసుకుంటామని డిజిసిఎ తాజా ఆదేశాలలో తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News