Sunday, April 6, 2025

ఎయిర్ ఇండియాకు డిజిసిఎ రూ. 30లక్షల జరిమానా

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వస్తున ఎయిర్ ఇండియా విమానంలో ఒక హహిళా ప్రయాణికురాలిపై తాగిన మైకంలో మరో ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన సంఘటనపై ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా విధించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఎ) ఆరోజు విమానం నడిపిన పైలట్ డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసింది. తన బాధ్యతల నిర్వహణలో విఫలమైన ఎయిర్ ఇండియా విమాన సర్వీసుల డైరెక్టర్‌కు కూడా రూ.1లక్ష జరిమానాను విధిస్తున్నట్లు డిజిసిఎ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో సహ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రా అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేయగా ఆయనకు కోర్టు జుడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News