Tuesday, March 11, 2025

ఎస్ఐ పరీక్ష రాసే అభ్యర్థులకు డీజీపీ కీలక సూచనలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లో ఎస్ఐ పరీక్ష రాసే అభ్యర్థులకు డీజీపీ అంజనీ కుమార్ సూచనలు చేశారు. హైదరాబాద్ లో శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు డిజిపి తెలిపారు. ఎస్ఐ పరీక్ష రాసే అభ్యర్థులు చాలా ముందుగా బయలుదేరాలని ఆయన సూచించారు. చివరి నిమిషం దాకా ఎదురు చూసి మిస్ చేసుకోవదన్నారు. సికింద్రాబాద్ ప్రాంతంలో కొన్ని రోడ్లు మూసివేస్తారని తెలిపారు. దారి మళ్లించే మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందన్నారు. ఎస్ఐ అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు వెళ్లాలనని డిజిపి తెలిపారు. 2 గంటల ముందే వెళ్లేలా అభ్యర్థులు ప్రణాళిక చేసుకోవాలని డీజీపీ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News