Wednesday, January 22, 2025

జహీరుద్దీన్ అలీఖాన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన డిజిపి అంజనీ కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందిన్ ప్రముఖ ఉర్దూ దినపత్రిక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దిన్ అలీఖాన్ కుటుంబ సభ్యులను డిజిపి అంజనీ కుమార్ మంగళవారం ఉదయం లక్డీకాపూల్‌లో ఉన్న వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. జహీరుద్దిన్ అలీఖాన్ అన్న జహెద్ అలీఖాన్, కుమారుడు అమీర్ అలీ ఖాన్‌లను పరామర్శించి, వారి కుటుంబ సభ్యు లను ఓదార్చారు. జహీరుద్దీన్ అలీఖాన్ అకాల మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. జర్న లిజానికి, ఉర్దూ పత్రిక రంగానికి ఎనలేని సేవలు చేశారని, నగరంలో మతసామరస్యానికి వారు చేసిన కృషిని ఈ సందర్భంగా డిజిపి అంజనీ కుమార్ గుర్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News