Monday, December 23, 2024

షూటింగ్ ఛాంపియన్‌షిప్ పతక విజేతలకు డిజిపి అభినందనలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ 9వ షూటింగ్ ఛాంపియన్‌షిప్ 2023-24లో పాల్గొని షూటింగ్‌లో పతకాలను సాధించిన పోలీస్ టీమ్‌ను డిజిపి అంజనీకుమార్ సోమవారం అభినందించారు. షూటింగ్‌లో పోలీస్ అధికారులు విజేతలుగా నిలవడం పోలీస్ శాఖకు గర్వకారణ మని ఆయన పేర్కొన్నారు. డిజిపి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో విజేతలను అభినందించారు.

విజేతల వివరాలు: రాచకొండ ఐటి అండ్ సి ఇన్‌స్పెక్టర్ ఎ. ప్రసన్నకుమార్ ( 25ఎం సెంటర్ ఫైర్ పిస్టల్‌లో బంగారు పతకం, 10ఎమ్ ఎయిర్ పిస్టల్ లో కాంస్య పతకం), హైదరాబాద్ సిఎస్‌డబ్లూ సిఐ బి. శంకర్ (25ఎం స్టాండర్డ్ పిస్టల్‌లో బంగారు పతకం, 25ఎం సెంటర్ ఫైర్ పిస్టల్‌లో రజత పతకం), జగిత్యాల డిఎఆర్ ఆర్‌ఐ జి. సైదులు (10ఎమ్ ఎయిర్ పిస్టల్ లో బంగారు పతకం), కామారెడ్డి డిఎఆర్ పిసి 285 కె. రాజ్ కుమార్ (50ఎం ఓపెన్ సైట్ రైఫిల్‌లో బంగారు పతకం), మంచిర్యాల జిల్లా టిఎస్‌ఎస్‌పి 13వ బిఎన్ హెచ్‌సి 501 పి శ్రీనివాస్ (25ఎం స్టాండర్డ్ పిస్టల్‌లో రజత పతకం), ఆసిఫాబాద్ జిల్లా డబ్లూపిసి 203 బి. స్రవంతి (10ఎం ఎయిర్ పిస్టల్‌లో రజత పతకం), కొండాపూర్ టిఎస్‌ఎస్‌పి 8వ బిఎన్ పిసి 3111ఇ. రాజ్ కుమార్ (50ఎం 3పి ఈవెంట్‌లో రజత పతకం), నిజామాబాద్ సిఎఆర్ డబ్లూపిసి 2377 సిహెచ్.మాధవి (50 మీటర్ల రైఫిల్ ప్రోన్‌లో రజత పతకం).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News