Friday, November 15, 2024

పోలీసుశాఖకు గర్వకారణం

- Advertisement -
- Advertisement -

DGP congratulates Deepti for getting job at Microsoft

అమెరికా మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం సాధించిన దీప్తికి డిజిపి అభినందనలు

మనతెలంగాణ/హైదరాబాద్‌: అమెరికాలో వార్షిక వేతనం రూ.2 కోట్లతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించిన దీప్తిని డిజిపి మహేందర్‌రెడ్డి అభినందించడంతో పాటు ఆమె సాధించిన ఘనత పోలీసుశాఖకు గర్వకారణమని ఆదివారం ట్వీట్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ క్లూస్ టీం ఇంఛార్జీ వెంకన్న కుమార్తె దీప్తి అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించడంతో ఆమెను డిజిపి అభినందించారు. నగర పోలీస్‌కమిషనరేట్ క్లూస్ టీం ఇంఛార్జీ వెంకన్న కుమార్తె ఉన్నత ఉద్యోగం పొందడం ఎంతో గర్వంగా ఉందన్నారు. పోలీస్ ఉద్యోగం చేస్తూ కుమార్తెను ఈ స్థాయికి తీసుకెళ్లిన వెంకన్నను డిజిపి అభినందించారు.

దీప్తి విజయం పోలీస్‌శాఖకే గర్వకారణమని ఆయన కొనియాడారు. కాగా దీప్తి మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో వార్షిక వేతనం రూ.2 కోట్లతో సాఫ్ట్‌వేర్ కొలువు సాధించారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఈనెల 2న ఎంఎస్(కంప్యూటర్స్) పూర్తి చేసిన దీప్తి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈనెల 17న ఉద్యోగ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంపికైన 300 మందిలో దీప్తికి అత్యధిక వార్షిక వేతనం లభించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News