Saturday, November 2, 2024

ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో పతకాలు సాధించిన విజేతలకు డిజిపి అభినందనలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మంగళవారం జరిగిన ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో పలు పతకాలు సాధించిన తెలంగాణ పోలీసు అధికారులు, కోచ్‌లను డిజిపి కార్యాలయంలో డిజిపి అంజనీకుమార్ సన్మానించారు. భోపాల్‌లో ఈ నెల 13 నుంచి 17 వరకు జరిగిన 66వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో నాలుగు విభాగాల్లో ఐదుగురికి అవార్డులు అందజేశారు. ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో అవార్డులు పొందిన వారికి అభినందనలు తెలుపుతూ ఇటువంటి పోటీ వృత్తిపరమైన పోటీతత్వాన్ని పెంచుతుందని అన్నారు.

అదనపు డిజిలు అభిలాష్ బిష్త్, మహేష్ ఎం భగవత్ సమక్షంలో ఐపిఎస్ పతక విజేతలను, కోచ్‌లను పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ కోవిడ్ తదితర కారణాలతో రాష్ట్ర స్థాయి పోలీసు డ్యూటీ సమావేశం నిర్వహించలేదన్నారు. ఆగస్టు లేదా సెప్టెంబరు నెలాఖరులోపు విధి సమావేశం నిర్వహిస్తామని, ఈ బాధ్యతను సిఐడి అదనపు డిజి మహేశ్‌ఎం భగవత్ అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో అవార్డు గ్రహీతలను డిజిపి అంజనీకుమార్ అభినందించారు. భోపాల్‌లో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో గెలుపొందిన పతకాలను సీనియర్ పోలీసు అధికారులు అందజేశారు.

పతకాలు..

రాచకొండ ఎల్‌బినగర్ సిసిఎస్ ఇన్‌స్పెక్టర్ సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించగా, ఎస్‌ఐబి ఇంటెలిజెన్స్ కమ్యూనికేషన్ ఎస్‌ఐ బి.వెంకటేష్ కంప్యూటర్ ఎవేర్‌నెస్ విభాగంలో సిల్వర్ మెడల్, ఇంటెలిజెన్స్ సిఐ సెల్ (హెచ్‌సి 1716) బి.విజయ్ కంప్యూటర్ ఎవేర్‌నెస్ విభాగంలో సిల్వర్ మెడల్, సైబరాబాద్ బాలానగర్ జోన్ ఎఫ్‌పి యూనిట్ (పిసి 5791) ఎ.అనిల్ కుమార్ పోలీసు వీడియోగ్రఫీ విభాగంలో సిల్వర్ మెడల్, బిడి ఆర్‌ఎస్‌ఐఐఎస్‌డబ్లూ హెచ్‌సి6469 జి.తిరుపతి/జి.రామకృష్ణారెడ్డిలు విధ్వంసక వ్యతిరేక తనిఖీ(గ్రౌండ్ సెర్చ్ టీమ్) టీమ్ 3rd పొజిషన్‌లో నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News