Monday, December 23, 2024

మావోయిస్టుల ప్రభావం తగ్గించాం.. మత కలహాల్లేవు

- Advertisement -
- Advertisement -

DGP Mahender Reddy released 2021 Police Annual Report

రాష్ట్రంలో 4.65% నేరాలు పెరిగాయి, డయల్ 100కు 11.24లక్షల ఫిర్యాదులు, షీటీమ్స్‌తో మహిళల భద్రతకు భరోసా, 800 పోలీస్‌స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు, పోలీసులపై ప్రజలకు విశ్వాసం పెరిగింది, 11 జాతీయ అవార్డులను సంపాదించగలిగాం, 2021 పోలీసు వార్షిక నివేదికను విడుదల చేసిన డిజిపి మహేందర్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 2021 సంవత్సరంలో 4.65 శాతం మేరకు నేరాలు పెరిగాయని డిజిపి డాక్టర్. ఎం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర డిజిపి కార్యాలయంలో శుక్రవారం నాడు (2021) పోలీస్‌వార్షిక నేర నివేదికను డిజిపి విడుదల చేశారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్‌శాఖ సఫలీకృతమైందని, రాష్ట్రాన్ని నేర, మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేసుకుని విధులు నిర్వహిస్తున్నామన్నారు. ఈక్రమంలో రాష్ట్రంలో మావోయిస్టుల రాకపోకలను నియంత్రించడంలో సమర్థవంతంగా పనిచేశామని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గనిర్దేశం మేరకు పోలీస్‌శాఖ పనిచేస్తోందని వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో 8,828 సైబర్‌నేరాలు, 838 హత్యలు, 12,531 చోరీలు, 1218 కిడ్నాప్‌లు, 2,382 అత్యాచారాలతో 4.65 శాతం నేరాలు పెరిగాయని కొవిడ్ సమయంలోనూ పోలీసులు ప్రజలకు అండగా ఉంటూ, బాధ్యతాయుతంగా నిలిచారన్నారు.

రాష్ట్రంలో మత ఘర్షణలు లేకుండా పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యామన్నారు. నగరాల్లో కేవలం 5 నిమిషాల్లో సంఘటనాస్థలాలకు చేరుకోవడంతోపాటు షీ టీమ్స్ ద్వారా మహిళలకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నామని, అలాగే గ్రామీణ ప్రాంతాలలోనూ షీటీమ్స్ అనతికాలంలో ఘటనాస్థలికి చేరుకుంటున్నారని స్పష్టం చేశారు. పేద, ధనిక తేడా లేకుండా పోలీస్‌శాఖ పనిచేస్తోందని, రాష్ట్రంలోని 800 పోలీస్‌స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు ప్రారంభించామని వివరించారు. రాష్ట్రంలో ఏడేళ్లుగా ఎలాంటి మత ఘర్షణలు జరగలేదని తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసాలోనే చిన్న గొడవలు మాత్రమే చోటుచేసుకున్నాయన్నారు. రాష్ట్ర పోలీసుల పనితీరుకు ఈ ఏడాది 11 జాతీయ అవార్డులు వచ్చాయని డిజిపి తెలిపారు.

మావోయిస్టులపై ఉక్కుపాదం

రాష్ట్రంలో ఈ ఏడాది 98 మావోయిస్టులను అరెస్టు చేశామని, 133 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయారని డిపిపి వెల్లడించారు. ఈ ఏడాది 2 కమిటీ మెంబర్లు, 4 ఏరియా కమిటీ మెంబర్లు, 8 మంది దళ స భ్యులు లొంగిపోయారన్నారు. అదేవిధంగా 8 ఫైర్ ఆ మ్స్, మావోయిస్టుల డంప్, నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల రాకపోకలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని, ఇందులో భాగంగా రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులతో పాటు ప్రత్యేక బలగాలు పహారా కా స్తున్నాయని డిజిపి వివరించారు. అలాగే నగరాల్లో ఉం టూ మావోయిస్టులకు సహకరిస్తున్న వారితో పాటు అర్బ న్ నక్సల్స్ కదలికలపై నిఘా సారిస్తున్నామన్నారు. వెరసి రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని డిజిపి వివరించారు.

నేరస్థులకు శిక్ష పడే వరకు

రాష్ట్రవ్యాప్తంగా 50.3 శాతం కేసుల్లో నేరగాళ్లకు శిక్షలు పడ్డాయని, 80 కేసులో 126 మందికి జీవిత ఖైదు పడిందని పేర్కొన్నారు. రాష్ట్రలో 851,644 సిసి కెమెరాలతో నిఘా పటిష్టం చేయడంతో పాటు 22,781 కీలక కేసుల ను సిసిటివి ఫుటేజీ ద్వారా ఛేదించినట్లు డిజిపి తెలిపారు. నిఘా నేత్రాల ద్వారా కీలక కేసులలోనూ ఆధారాలు లభిస్తున్నాయని తెలిపారు. నేరాల నియంత్రణ, నేరగాళ్లను పట్టుకోవడంలో మంచి ఫలితాలు సాధించామని, గత ఏ డాదితో పోలిస్తే డ్రగ్స్, గంజాయిని అరికట్టేందుకు పటి ష్ట చర్యలు తీసుకున్నామని తెలిపారు. దీని కోసం ఇంటెలిజెన్స్‌ని ఏర్పాటు చేసి, నేరగాళ్ల డేటా ఒకే పోర్టల్‌లో ఉం చడంతో ఇతర రాష్ట్రాలు కూడా నిందితులను గుర్తించేలా చేశామన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదుల స్వీకరిస్తున్నామని, ఈక్రమంలో ఈ ఏడాది డయల్ 100కి 11.24 లక్షల ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో 800 పోలీస్‌స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు ప్రా రంభించామని, షీ టీమ్స్ 5,145 ఫిర్యాదులు స్వీకరించి బాధిత మహిళలలకు భరోసా కల్పించడం జరిగిందన్నా రు.

అలాగే హాక్‌ఐ ద్వారా 83 వేలకుపైగా ఫిర్యాదులు స్వీకరించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ నేరాలకు పాల్పడిన 664 మంది నేరగాళ్లపై పిడి చట్టం నమో దు చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో రహదారి ప్రమాదాల్లో 6,690 మంది చనిపోయారని వెల్లడించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై రూ.879 కోట్ల జరిమానా విధించామని పేర్కొన్నారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిరోధానికి ప్రత్యేక డేటా బేస్ ఉందని ప్రత్యేక డేటా బేస్ ద్వారా 25 వేల కేసులు ఛేదించామని డిజిపి వివరించారు. ఈ సంవత్సరం షీటీమ్స్ సమర్థంగా పని చేసి 5,145 మంది మహిళా బాధితులకు న్యాయం చేసామని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రూ. 877 కోట్లు చాలాన్‌లు విధించామని, ఈ సంవత్సరం 664 మందిపై పిడి యాక్ట్ నమోదు చేసామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తో పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. కరోనా సంక్షోభం సమయంలో పోలీసులు ఎంతో బాధ్యతాయుతంగా పని చేశారని, ప్రజలను చైతన్యవంతం చేశారని చెప్పారు.

జైళ్ల శాఖ మాదిరిగా రాష్ట్రంలో 4 పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేయనున్నామన్నారు. వీటిపై వచ్చే ఆదాయం పోలీసు సంక్షేమ నిధికి తరలిస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని 85వేల మంది పోలీసులు, 15వేల మంది హోంగార్డులతో నేర, మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నట్లు డిజిపి వివరించారు.

ఉత్తమ ఎస్‌హెచ్‌వోలకు అవార్డులు

హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్ నగర్, భద్రాద్రి కొత్తగూడెంలోని మణుగూరు, కొమురంభీం ఆసీఫాబాద్ జిల్లాలోని ఆసీఫాబాద్, ఖమ్మం జిల్లాలోని వెమ్‌సూర్ పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌వొల పనితీరుకు కితాబునిస్తూ ఉత్త మ పోలీస్‌స్టేషన్లుగా ప్రకటించడంతో పాటు ఆయా పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌వొలకు డిజిపి అవార్డులను అందించా రు. ఈక్రమంలో కేసుల దర్యాప్తు, ఖచ్చితమైన విశ్లేషణ, నేరాల నివారణ, సమర్థవంతమైన విచారణ, ప్రాయాక్టివ్ పోలీసింగ్, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ తదతర అంశాల లో ఉత్తమ ఫలితాలు సాధించిన ఎస్‌ఆర్ నగర్ పిఎస్ ఎస్‌హెచ్‌వొ సైదులు, మణుగూరు ఎస్‌హెచ్‌వొ భానుప్రకాశ్, అసిఫాబాద్ అశోక్, వెమ్‌సూర్ ఎస్‌హెచ్‌వొ సాయికుమార్‌లకు డిజిపి అవార్డులు, రివార్డులు అందజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News