Wednesday, January 22, 2025

సైబర్ నేరాల కట్టడిలో మనమే ‘టాప్’

- Advertisement -
- Advertisement -

DGP Mahender reddy said about cyber crime

ఆన్‌లైన్ ఫిర్యాదులను ఎఫ్‌ఐఆర్‌లుగా
నమోదు చేయడంలో అగ్రస్థానం
నేరస్థులబారిన పడకుండా
రూ.26 కోట్లకు రక్షణ :డిజిపి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై కేసులు నమోదు చేసి సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టడంలో రాష్ట్ర పోలీసు శాఖ నిబద్ధత, అమలు చేస్తున్న విధానాలు దేశవ్యాప్తంగా ఆదర్శనీయంగా మారాయని డిజిపి మహేందర్‌రె డ్డి ఒక ప్రకనటలో పేర్కొన్నారు. దేశంలోనే రాష్ట్ర పోలీసు శాఖ ఆన్‌లైన్ ఫిర్యాదులను పిటిషన్‌లను ఎఫ్‌ఐఆర్‌లుగా మార్చడంలో మొదటి స్థానంలో ని లిచిందన్నారు. అయితే అనేక రాష్ట్రాలు సైబర్ క్రై మ్ లపై ఆన్‌లైన్ పిటిషన్‌లను స్వీకరించినప్పటికీ, నేరాలను నియంత్రించడం, బాధితులకు న్యాయం చేయడంలో రాష్ట్ర పోలీసు అన్ని రాష్ట్రాల కన్నా ముందంజలో ఉందని డిజిపి వివరించారు. నేర ని రోధంలో పటిష్టమైన విధానాన్ని అమలుచేస్తున్నామని, ప్రతి ఉల్లంఘనను రికార్డ్‌లోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర పోలీసులు అన్ని అన్నింటిపై ఎఫ్‌ఐఆర్‌ల నమోదును చేస్తున్నారన్నారు.

తద్వా రా ఫిర్యాదుదారుల ఫిర్యాదులు సమర్థవంతంగా పరిష్కరించడంతో పాటు నేరస్థులను విజయవంతంగా ప్రాసిక్యూట్ చేయగలుగుతున్నామని వివరించారు. పౌర కేంద్రీకృత పోలీసింగ్ విజన్‌కు అ నుగుణంగా బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ పోలీసుల ముందస్తు చర్యలతో నమోదైన కేసుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలు, మా నవ అక్రమ రవాణా రంగాలలో తెలంగాణ రాష్ట్రం అ గ్రస్థానంలో ఉందని ఎన్‌సిఆర్‌బి నివేదికను ఉటంకిస్తూ ప్రచురించిన కథనాలతో నేరాల వాస్త వ చి త్రాన్ని ప్రతిబింబించే విధంగా లేవన్నారు. సైబర్ క్రైమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయినప్పటికీ, ఈ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొని, నేరాలకు గురైన బాధితులకు తగు న్యాయం చేయడంలో రాష్ట్ర పోలీసులు తీసుకున్నసమర్ధవంతమైన చర్యలే ప్రధాన కారణమని తెలిపారు.

సైబర్ నేరాల కట్టడి:

ప్రస్తుత డిజిటల్ యుగంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో సైబర్ నేరాలు అధికంగా నమోదవుతున్నాయని, ఈక్రమంలో జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సైబర్ నేరస్థులు సైబర్ నేరాలే లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నారన్నారు. పలు పోలీసు ఏజెన్సీలు, స్టీక్ హోల్డర్లు మధ్య సైబర్ క్రైమ్ నివారణ, గుర్తింపు ప్రయత్నాలను సమన్వయం చేసేందుకై భారత ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఇండియన్ సైబర్ క్రైమ్స్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)ని ఏర్పాటు చేసిందన్నారు.ఈ I4C కింద, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 తోపాటు నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లను ఏర్పాటు చేసి వీటిలో సైబర్ నేరాలను సులభంగా, వేగంగా నమోదు చేసేందుకై భారత ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. గత ఏడాది జూన్‌లో తెలంగాణ రాష్ట్రం ఎన్‌సిఆర్‌పి, టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1930 ని ప్రారంభించిందని గుర్తుచేశారు. అప్పటి నుంచి రాష్ట్ర పోలీసులు సకాలంలో స్పందించడం వల్ల రూ.26.6 కోట్లు సైబర్ నేరస్తుల చేతికి చేరకుండా నిరోధించడం జరిగిందన్నారు.

సైబర్ నేరాల నమోదు కేంద్రం పనితీరును అన్ని రాష్ట్రాలతో కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందన్నారు. ఈ పోర్టల్ లో నమోదైన ఆన్‌లైన్ ఫిర్యాదులను ఎఫ్‌ఐఆర్‌లుగా మార్చాలని కూడా ఆదేశాలు జారీచేసిందని, తద్వారా రికవరీ చేసిన బాధితులకు తిరిగి డబ్బును వారికి చెల్లించడంతోపాటు నేరస్థులను న్యాయస్థాన పరిధిలోకి తీసుకురావచ్చే అవకాశం ఏర్పడిందన్నారు. ఈ నిర్ణయం ప్రకారంగా రాష్ట్రంలో ఎఫ్‌ఐఆర్ మార్పిడి శాతం 17.52% తో దేశంలోనే అత్యుత్తమంగా ఉందన్నారు. ఎఫ్‌ఐఆర్‌ల నమోదు నేరస్థులను అరెస్టు చేయడం, చోరీ అయిన డబ్బును తిరిగి రికవరీ చేయడం తద్వారా బాధితులకు న్యాయం చేసే అవకాశం ఏర్పడిందన్నారు. నమోదైన ఫిర్యాదుల సంఖ్య ప్రకారం భారతదేశంలోని టాప్ 10 రాష్ట్రాలు క్రింది విధంగా ఉన్నాయి. రాష్ట్రం నమోదైన సైబర్ క్రైమ్‌ఆన్‌లైన్ ఫిర్యాదులు నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు ఎఫ్‌ఐఆర్‌మార్పిడి శాతం నిలిపేవేసిన మొత్తం కోట్లలో)

ఉత్తర ప్రదేశ్ 220131 1432 0.65 17.08

ఢిల్లీ 143712 3919 2.73 7.21

మహారాష్ట్ర 126811 950 0.73 20.03

రాజస్థాన్ 91033 236 0.26 13.90

తెలంగాణ 80697 14135 17.52 26.60

గుజరాత్ 78515 885 1.13 17.05

తమిళనాడు 73215 1664 2.27 5.74

కర్ణాటక 63660 451 0.71 3.67

హర్యానా 55176 1048 1.90 4.37

పశ్చిమ బెంగాల్ 43689 108 0.25 1.67

ఈ పోర్టల్‌తో మోసగాళ్లకు చెక్ ః

దేశవ్యాప్తంగా ఈ పోర్టల్‌ని ఉపయోగించి అన్ని రాష్ట్రాలు కలిపి రూ. 116 కోట్లు సైబర్ మోసగాళ్లకు చేరకుండా నిరోధించగలిగాయని, ఈక్రమంలో రూ.26.6 కోట్లను ఒక్క తెలంగాణ పోలీసులే అడ్డుకున్నారని డిజిపి తెలిపారు. ఇది మొత్తంలో 23% తో దేశంలోనే అత్యధికంగా ఉందని. లోన్ యాప్స్ మోసగాళ్లు, కెబిసిలాటరీ మోసాలు, ఆధార్ ఎనేబుల్ పేమెంట్స్ మోసాలు, చెల్లింపు మోసాలు తదితర దేశవ్యాప్త సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌లను గుర్తించడంతోపాటు వీటిని ఛేదించడంలో రాష్ట్ర పోలీసులు అగ్రస్థానంలో ఉన్నారన్నారు. దేశవ్యాప్తంగా నమోదైన 34,000 కేసులకు సంబంధించిన లింక్‌లను రాష్ట్ర పోలీసులు కొనుగొన్నారన్నారు. సైబర్ క్రైమ్‌లు, నేరస్థులను ట్రాక్ చేయడానికి రాష్ట్ర పోలీసులు ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన సైక్యాప్స్ అనే సాఫ్ట్‌వేర్‌ను దేశంలోని 25 రాష్ట్రాలు ఉపయోగిస్తున్నాయని తెలిపారు. ఈ ఐటి సైక్యాప్స్ అప్లికేషన్ కు తెలంగాణ పోలీస్ కేంద్ర ప్రభుత్వం మొదటి బహుమతిని అందుకుందని గుర్తుచేశారు. ఈ అవార్డు ఆగస్టు 31(నేడు) భారత ప్రభుత్వం అందచేయనుందన్నారు.

యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్‌లో ః

దేశంలోని అన్ని జిల్లాల్లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2018లో ఆదేశించిందని, ట్రాఫికింగ్ సెక్షన్ల (370) కింద వ్యభిచార కేసులన్నింటినీ నమోదు చేసి, ఈ వ్యభిచారం కేసులను పరిష్కరించాలని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసిందని డిజిపి తెలిపారు. వ్యభిచారం, లైంగిక దోపిడీ, బాండెడ్ లేబర్, బాలకార్మికులు మొదలైన వాటికి సంబంధించి అన్ని కేసులను నమోదు చేయడంలో రాష్ట్రం ముందంజలో ఉందని వివరించారు. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో ఎహెచ్‌టియులను ఏర్పాటు చేసిందని, ఎహెచ్‌టియులు ట్రాఫికింగ్ కేసులను పటిష్టంగా నమోదు చేయడం, దర్యాప్తు, విచారణ సమర్దవంగా విచారించేందుకై రాష్ట్ర స్థాయిలో మహిళా భద్రతా విభాగంలో ప్రత్యేకంగా వర్టికల్ యూనిట్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారన్నారు. మానవ అక్రమ రవాణాకు సంబంధించి బాధితులకు న్యాయం చేయడం, నేరస్తులకు తగు శిక్షపడేలా రాష్ట్ర పోలీసులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు.

ముఖ్యంగా వ్యభిచారం, బాండెడ్ లేబర్, చైల్ లేబర్ మొదలైన వాటికి సంబంధించిన 2021 సంవత్సరంలో రాష్ట్రంలో 347 కేసులను సెక్షన్లు 370, 370ఎ, పిఐటిఎ, లతోపాటు స్థానిక చట్టాల కింద బుక్ చేశామన్నారు. పోలీస్ శాఖ 480 మంది ట్రాఫికర్లను అరెస్టు చేసిందని, పలు విధాల ట్రాఫికింగ్‌కు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడంలో రాష్ట్ర పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను భారత హోమ్ మంత్రిత్వ శాఖ కూడా ప్రశంసించిందని తెలిపారు. యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న ఈ ఉత్తమ పద్దతులను ఇతర రాష్ట్రాలు కూడా పాటించేందుకై వీటి వివరాలను పంపాలని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కూడా తెలంగాణా రాష్ట్రాన్ని కోరడం జరిగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News