Monday, December 23, 2024

రైల్వేల రాష్ట్ర స్థాయి భద్రతా కమిటీ పనితీరును సమీక్షించిన డిజిపి రవి గుప్తా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని రైల్వే ప్రాంతాల భద్రత పరిస్థితులపై డిజిపి రవి గుప్తా సమీక్షించారు. రాష్ట్ర డిజిపి కార్యాలయంలో రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ ఎడిజి మహేష్ ఎం భగవత్ ఆధ్వర్యంలో రైల్వే పోలీస్, రైల్వే అధికారులతో సమీక్ష సమావేశం సోమవారం నిర్వహిం చారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్ పి ఎఫ్) ఇన్స్పెక్టర్ జనరల్, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అరోమ సింగ్ ఠాకూర్, సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్, హైదరాబాద్ అనూప్ కుమార్ శుక్ల , సీనియర్ డిఎస్‌పి సికింద్రాబాద్ దెబష్మిత సి బెనర్జీ , రైల్వే అడిషనల్ డిఆర్‌ఎం రాజీవ్ కుమార్ గంగెలే, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డిఐజి తఫ్సీర్ ఇక్బాల్, ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ జి దామోదర్ రెడ్డి , రైల్వే ఎస్‌పి సలీమ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

సమీక్ష సమావేశంలో డిజిపి రవిగుప్త మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైల్వే పోలీస్‌కు అవసరమైన మరికొంతమంది పోలీస్ సిబ్బందిని కేటాయించే విషయమై చర్చిస్తానని అన్నారు. రైల్వే విభాగంలో ప్రభుత్వ రైల్వే పోలీసులు (జిఅర్‌పి) 12 రైల్వే పోలీస్ స్టేషన్లోనూ 17 రైల్వే అవుట్ పోస్టులను పని చేస్తున్నారని తెలియజేశారు. రైల్వే పోలీస్‌స్టేషన్ల పరిధిలో అవసరమైన కెమెరాలను ఇతర భద్రతాపరమైన సామాగ్రిని పెంచేలా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. హైదరాబాద్ మహానగరం దేశంలోనే అత్యధిక సిసి టివిలు కలిగిన రాజధానిగా పేరు ఉందని తదనుగుణంగా రైల్వే స్టేషన్లలోనూ ఏర్పాటు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. పండుగ రోజుల లోను , సెలవుదినాలలోనూ ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న సందర్భాలలో అదనపు భద్రతపై చర్యలు చేపట్టాలని అన్నారు. రైల్వే ట్రాక్లపై జరుగుతున్న ప్రమాదాలు అన్నింటి పైన రైల్వే పోలీసులు విచారణ జరపాలని సూచించారు ఈ సందర్భంగా రైల్వేస్ అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్లపై ప్రమాదాలు అరికట్టేందుకు ఆయా ప్రాంతాల్లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు , ఫెన్సింగ్ ల ఏర్పాటు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. నాంపల్లి, కాజీపేట, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లోని రైల్వే పోలీస్ స్టేషన్లను రైల్వే స్టేషన్ల లో ఏర్పాటు చేయడం ద్వారా బాధితులు త్వరితగతిన ఫిర్యాదు చేసేందుకు ఆస్కారం ఉంటుందన్నారు .లింగంపల్లి ,బేగంపేట్, మేడ్చల్‌లలో జి అర్‌పి సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాల్సిన ఉందన్నారు.

సికింద్రాబాద్ రూరల్ రైల్వే పోలీస్ సబ్ డివిజన్, హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్ల కార్యాలయాల పునర్నిర్మాణం కానీ, కొత్త కార్యాలయం ఏర్పాటు కానీ చేయాల్సి ఉందన్నా రు. మహబూబ్ నగర్, వికారాబాద్, నల్గొండ , కాజిపేట్, వరంగల్ మంచిర్యాల రైల్వేస్టేషన్లలో సదుపాయాలు ఆధునికరణ జరగాల్సి ఉందని పేర్కొన్నారు .కరీంనగర్లో రైల్వే పోలీస్ స్టేషన్‌ని, కోరుట్ల , సిద్దిపేటలో రైల్వే అవుట్ పోస్టులను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. లింగం పల్లి, చర్లపల్లి, ఫలక్నామా లలో జి ఆర్ పి సిబ్బందికి సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిందని తెలిపారు డ్రగ్స్ , గంజాయి సికింద్రాబాద్ కాజీ పేట లలో స్టీఫర్డ్ డాగ్స్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. జిఆర్పి సిబ్బంది కోసం రైల్వే ఆసుపత్రిలో ఉచిత వైద్య సదుపాయం కల్పించే టట్టుగా చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు. సమావేశంలో డిజిపి రవి గుప్తా రైల్వే ప్రయాణికులకు సూచనలు చేస్తూ. అనుమానాస్పద వ్యక్తులు తారసపడిన వస్తువులు కనిపించిన 100 గాని 139 కు గాని 1512 కు గాని సమాచారం అందించాలని, అపరిచితుల దగ్గర నుంచి తినే పదా ర్థాలను తీసుకోవద్దని, మహిళలు రాత్రిపూట ప్రయాణించేటప్పుడు ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్న కంపార్ట్మెంట్లోనే ఉండాలన్నారు. ప్రయా ణికులు మొబైల్ ఫోన్లు చేయుట గురైతే సమీప రైల్వే పోలీస్ స్టేషన్లో గాని, www.ceir.gov.in.కు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రయాణికుల భద్రత కోసం , ఆర్పిఎఫ్ ,జిఆర్‌పి సిబ్బంది బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు అడిషనల్ డిఆర్‌ఎం రాజీవ్‌కుమార్ గెంగేలె తదితర అధికారులు తమ అభిప్రాయాలను తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News