Saturday, January 11, 2025

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న డిజిపి రవిగుప్తా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయ పరిసరాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. క్యూలైన్లో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని డిజిపి రవి గుప్తా సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయశాల, సత్యనారా యణ స్వామి వ్రత మండపం, కొండ క్రింద విష్ణు పుష్కరణి, కారు పార్కింగ్, బస్ స్టాండ్‌లో భక్తుల సందడి నెలకొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News