Monday, January 20, 2025

ఢాకాలో అగ్ని ప్రమాదం… 44 మంది సజీవదహనం

- Advertisement -
- Advertisement -

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బెయిలీ రోడ్డులోని బిర్యానీ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగడంతో 44 మంది సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని దాదాపుగా 75 మంది రక్షించారు. ఆ భవనంలో గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. అగ్నిమాపకయంత్రాలు రెండు గంటల్లోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బెయిల్ రోడ్డులో వస్త్ర దుకాణాలు, మొబైల్ ఫోన్ల విక్రయ కేంద్రాలు అధికంగా ఉన్నాయి. ఆరో అంతస్తుల నుంచి పొగలు రావడంతో కొందరు పైపులు పట్టుకొని కిందకు దిగారు. కొందరు మాత్రం పైనుంచి కిందకు దూకారు. 2021 జులైలో ఓ ఆహార శుద్ధ కార్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 52 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. 2019 పిభ్రవరిలో ఢాకాలోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటల్లో 70 మంది సజీవదహనమైన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News