Monday, January 20, 2025

‘ధమాకా’ బాక్సాఫీసు బొనాంజా..

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో వస్తున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’ధమాకా’. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈనెల 23న ‘ధమాకా’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతున్న నేపధ్యంలో హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ వేడుకలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. “రవితేజ మామూలోడు కాదు. ‘అల్లరి ప్రియుడు’లో చిన్న వేషం వేశాడు. ఆర్కెస్ట్రాలో డ్రమ్స్ కొట్టే వేషం అది. అప్పుడు రవితేజ డ్రమ్స్ వాయించే స్టయిల్ చూస్తే .. ఎప్పుడో ఓ రోజు ఇండస్ట్రీని వాయించేస్తాడని అనిపించింది. ‘పెళ్లి సందడి’లో శ్రీలీల ప్లూట్ వాయించింది. దెబ్బకి ఆకాశంలో తారలు నేల వాలిపోయాయి. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కలలా నా సినిమాల్లో చేసిన రవితేజ, శ్రీలీల గొప్ప స్థాయిలో వుండటం ఎంతో ఆనందంగా వుంది. వీరు మరింత గొప్ప స్థాయికి ఎదగాలి”అని చెప్పారు.

రవితేజ మాట్లాడుతూ “ధమాకా సినిమా ఖచ్చితంగా బావుంటుంది. రామ్, లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్, యాక్షన్‌తో అదరగొట్టారు.ప్రసన్న హ్యుమర్ నాకు చాలా ఇష్టం. ‘ధమాకా’ను అద్భుతంగా రాశాడు. దర్శకుడు త్రినాథరావు ఇరగదీశారు. పాత చిత్రాల్లో రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య కాంబినేషన్‌లా ‘ధమాకా’లో రావు రమేష్, ఆదిల కాంబో సరదాగా ఉంటుంది. శ్రీలీల రెండో సినిమాకే జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. అందంతో పాటు తనలో చాలా ప్రతిభ వుంది. భీమ్స్ ఒకొక్క పాట ఇరగదీశాడు”అని అన్నారు.

దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ “ధమాకా… అదిరిపోయింది. మాములుగా లేదు. నేను రవితేజ ఫ్యాన్ నే. రవితేజ ఏం చేస్తే థియేటర్లో ఎగిరి గంతేస్తారో తెలుసు. ఈ సినిమా చూస్తున్నప్పుడు అలాగే ఎగిరిగెంతాను. డైలాగులు మాములుగా లేవు. ప్రసన్న ఇరగొట్టాడు. రవితేజ గారు ఎలాంటి డైలాగులు చెబితే థియేటర్ అదిరిపోతుందో అలాంటి డైలాగులు అద్భుతంగా రాశాడు. ధమాకా.. బాక్సాఫీసు బొనాంజా”అని తెలిపారు. ఈ వేడుకలో శ్రీలీల, టీజీ విశ్వప్రసాద్, మారుతి, శ్రీవాస్, ప్రసన్న కుమార్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల, భీమ్స్ సిసిరోలియో, సముద్రఖని, హైపర్ ఆది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News