Monday, December 23, 2024

స్పెయిన్‌లో ఆటాపాట..

- Advertisement -
- Advertisement -

Dhamaka Movie Song Shoot in Spaine

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు త్రినాధరావు నక్కిన కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. నటి శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరించారు. ఈ యాక్షన్ ఎపిసోడ్‌కు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేశారు. కాగా పాటల చిత్రీకరణ కోసం టీమ్ స్పెయిన్ వెళ్లింది. ప్రస్తుతం రవితేజ, శ్రీలీలపై ఓ పాటను ప్లాజా డి ఎస్పానా అనే హిస్టారికల్ లొకేషన్‌లో చిత్రీకరిస్తున్నారు. ప్లాజా డి ఎస్పానా స్పెయిన్‌లోని సెవిల్లెలోని పార్క్ డి మారియా లూయిసాలో ఉన్న ప్లాజా. ఇది ప్రాంతీయ వాస్తుశిల్పంతో రూపొందిన ప్రపంచంలోనే ప్రత్యేకమైన ప్లాజా, ప్యాలెస్. రొమాంటిక్ పాటను చిత్రీకరించడానికి ఇది ఖచ్చితంగా అద్భుతమైన ప్రదేశం. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Dhamaka Movie Song Shoot in Spaine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News