Monday, December 23, 2024

బాధిత కుటుంబాలని పరామర్శించిన పుష్కర్ సింగ్ ధామీ

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ శనివారం జోషిమఠ్‌కు చేరుకున్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను ఆయన పరీక్షించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. జోషిమఠ్ ప్రాంతంలో 600 ఇళ్లకు పగుళ్లు చోటుచేసుకోవడంతో ప్రజలు కంగారు పడుతున్నారు. ముఖ్యమంత్రి చేరుకున్న మౌంట్ వ్యూ హోటల్ వద్ద సీనియర్ పోలీసు అధికారులను, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం(ఎస్‌డిఆర్‌ఎఫ్)ను మోహరించారు. కొండచరియలు విరిగిపడ్డంతో రెండు హోటళ్లు మౌంట్ వ్యూ, మల్లారీ స్వల్పంగా దెబ్బతిన్నాయి. వాటి వెనుక ఉన్న అనేక గృహాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

ఆ ప్రాంతాన్ని పరిశీలించాక, అక్కడి ప్రజలను కలుసుకున్నాక ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఇండో-టిబెటియన్ బార్డర్ పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అంతేకాక ఆయన జోషిమఠ్‌ను ఏరియల్ సర్వే కూడా చేశారు. ‘ఈ ప్రాంత ప్రజలను సురక్షితంగా కాపాడాలని చూస్తున్నాం’ అని ఆయన విలేకరులకు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News