- Advertisement -
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ జంట విడాకులు తీసుకుంది. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్టు చాహల్ తరఫు న్యాయవది నితిన్ కుమార్ వెల్లడించారు. విడాకులు పిటిషన్ విచారణ కోసం ధనశ్రీ, చాహల్ గురువారం మధ్యాహ్నం కోర్టుకు వచ్చారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నందున ఆరు నెలల తప్పనిసరి విరామ గడువును బాంబే హైకోర్టు రద్ద చేసింది. మార్చి 20 లోగా విడాకుల పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. దీనిపై విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. కాగా, భరణం కింద ధనశ్రీకి చాహల్ రూ.4.75 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించాడని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పటి వరకు చాహల్ రూ.2.37 కోట్లను ధనశ్రీకి చెల్లిచినట్టు తెలిసింది. కాగా, చాహల్, ధనశ్రీల వివాహం 2020లో జరిగింది.
- Advertisement -