Friday, March 21, 2025

చాహల్‌తో విడాకులు.. గృహహింస వీడియోతో వచ్చిన ధనశ్రీ

- Advertisement -
- Advertisement -

టీం ఇండియా స్పిన్నర్ యుజవేంద్ర చాహల్, యూట్యూబర్ ధనశ్రీ వర్మ ఇటీవలే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే సరిగ్గా ఇదే టైంకి ఆమె గృహహింస పాటతో ముందుకొచ్చింది. 2020లో చాహల్‌తో ధనశ్రీ వివాహం జరిగింది. అయితే కొంతకాలంగా వీరిద్దరు విడిగా ఉంటున్నారు. దీంతో వీరిద్దరి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా.. కోర్టు విడాకులు మంజూరు చేసింది. ధనశ్రీకి చాహల్ రూ.4.75 కోట్ల భరణం చెల్లించాలని ఆదేశించింది.

ఇది తాజాగా ధనశ్రీ ‘దేఖా జీ దేఖా మైనే’ అనే పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పాటలో ఆమె గృహహింసకు గురైన మహిళగా, భర్త చేతిలో మోసపోయిన భార్యగా కనిపించింది. భర్తను ఎంతగానో ప్రేమించినప్పటికీ.. ఆతను వేరే మహిళతో రిలేషన్‌లో ఉండటం.. ఆ విషయం అడిగినందుకు దాడి చేయడం, చివరకు విడాకులు తీసుకోవడం ఈ పాటలో మనం చూడొచ్చు. మరి ఈ పాటను ధనశ్రీ కావాలనే చాహల్‌ని ఉద్దేశించే విడుదల చేసిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News