Wednesday, January 22, 2025

మంత్రిపై పసుపు పోసిన నిరసనకారుడు

- Advertisement -
- Advertisement -

సోలాపూర్ : మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్‌పై ఓ వ్యక్తి పసుపు చల్లి కలకలం రేపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రాధాకృష్ణ విఖే వద్దకు ధాంగర్ సామాజిక వర్గానికి సంబంధించిన సభ్యులతో కలిసి శుక్రవారంనాడు ఓ వ్యక్తి వచ్చాడు. ధాంగర్ వర్గానికి రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ మరో వ్యక్తితో కలిసి మంత్రికి లేఖ ఇచ్చాడు.

రాధాకృష్ణ ఆ లేఖను చదువుతున్న సమయంలో ఆ వ్యక్తి జేబులో నుంచి పసుపు ప్యాకెట్ తీసి మంత్రిపై దాన్ని చల్లాడు. దీంతో అతడిని రాధాకృష్ణ అనుచరులు పక్కకు లాగారు. అతడిని కిందపడేసి చితకబాదారు. అయినప్పటికీ అతడు రిజర్వేషన్లు కావాలంటూ నినాదాలు చేశాడు. రాధాకృష్ణ తల పసుపుతో నిండిపోయింది. సోలాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రిపై పసుపు చల్లిన వ్యక్తి పేరు శేఖర్ బంగాలేగా పోలీసులు గుర్తించారు. తమ వర్గానికి చెందిన ప్రజల ఇబ్బందులపైకి ప్రభుత్వం దృష్టిని మళ్లించడానికే ఇలా చేశానని శేఖర్ బంగాలే చెప్పాడు. తనపై పసుపు చల్లినందుకు తానేం బాధపడడం లేదని రాధాకృష్ణ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News