Wednesday, January 22, 2025

జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ధన్‌తేరాస్‌ ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరవాసులందరీకీ లక్ష్మిదేవి, కుబేరుడి కటాక్షం సదా ఉండాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆకాంక్షించారు. ధన్ తేరాస్ (ధన త్రయోదశి) సందర్భంగా శుక్రవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం ట్రెజరీ లో ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దీపావళి పండుగను పురస్కరించుకొని ధన్ తేరాస్ ఉత్సవాలలో భాగంగా భక్తులు లక్ష్మీదేవి, కుబేరుడు, ఆరోగ్య దేవుడైన ధన్వంతరి లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు.

భక్తులు లక్ష్మీదేవిని కొలవడం ద్వారా ఐశ్వర్యం ఆయురారోగ్యాలు పొందుతారని తెలిపారు. వెలుగులను విరజిమ్మేదీపావళి ని నగరవాసులు భక్తిశ్రద్దలతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చార్మినార్, చాంద్రాయణ గుట్ట కు జనరల్ అబ్జర్వర్ గా నియమించిన సమీర్ శర్మ, అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరిష్, సరోజ, జయరాజ్ కెనడి, శంకరయ్య, చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మజ, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News