Monday, January 20, 2025

ఎర్రగడ్డలో ట్రావెల్స్ బస్సు బీభత్సం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం ఎర్రగడ్డ సిగ్నల్ వద్ద వేగంగా వచ్చిన ధనుంజయ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఆగి ఉన్న కార్లపైకి దూసుకెళ్లింది. దీంతో ప్రజలు భయంతో దూరంగా పరుగులు తీశారు. ఈ ఘటనలో కార్లలో ఉన్న నలుగురు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారించనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News