Monday, December 23, 2024

ధనుష్ ‘సార్’ షురూ

- Advertisement -
- Advertisement -

Dhanush movie ‘Sir’ started

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై హీరో ధనుష్, -దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ద్విభాషా చిత్రం ‘సార్’ (తెలుగు), ‘వాతి’ (తమిళం) చిత్రాన్ని హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ధనుష్, సంయుక్త మీనన్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్‌తో ఈ చిత్రం మొదలైంది. ప్రముఖ పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి, ప్రముఖ నిర్మాత డా. కె.ఎల్.నారాయణ కెమెరా స్విచాన్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ స్క్రిప్ట్ అందచేశారు. నిర్మాత ఎం.ఎల్. కుమార్ చౌదరి, ప్రగతి ప్రింటర్స్ అధినేత మహేంద్ర తదితరులు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందచేశారు. నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 5 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమవుతుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ : దినేష్ కృష్ణన్, మ్యూజిక్: జి.వి. ప్రకాష్‌కుమార్, ఎడిటర్: నవీన్ నూలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News