Monday, December 23, 2024

విద్యా వ్యవస్థ నేపధ్యంలో…

- Advertisement -
- Advertisement -

జాతీయ అవార్డు గ్రహీత, స్టార్ హీరో ధనుష్‌తో దర్శకుడు వెంకీ అట్లూరి తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రం ‘సార్’(తెలుగు), ‘వాతి’(తమిళం) షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్), శ్రీకర స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ‘సార్’ ధనుష్‌తో సంయుక్త మీనన్ జోడీ కడుతున్నారు ఈ చిత్రంలో. ఇటీవల ‘యాన్ యాంబిషియస్ జర్నీ ఆఫ్ ఎ కామన్ మ్యాన్’ స్లోగన్‌తో విడుదలైన టైటిల్ రివీల్ వీడియో ఒక ఉద్వేగభరితమైన, ఉత్తేజకరమైన కథను దర్శక నిర్మాతలు మనకు అందించనున్నారనే నమ్మకం కలిగించింది. ఇక గురువారం చిత్ర కథానాయకుడు ధనుష్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని వేడుకలకు ఒక రోజు ముందే ‘సార్’ తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ప్రచార చిత్రంలో ధనుష్ ‘సార్’ ఓ లైబ్రరీలో కూర్చొని శ్రద్ధగా,దీక్షగా రాసుకుంటున్నట్లు కనిపిస్తారు. ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నారు, దేనికి సిద్ధ మవుతున్నారు లాంటి ప్రశ్నలన్నింటికీ ‘సార్’ సమాధానం వెండితెర మీద చూడాల్సిందే. ఈ ప్రచార చిత్రంతో సినిమా పట్ల మరింత ఆసక్తిని పెంచే దిశగా ధనుష్ పుట్టినరోజు అయిన శుక్రవారం సాయంత్రం 6 గంటలకు విడుదలయ్యే వీడియో ఉండబోతోందని తెలుస్తోంది.

ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ…“సార్ చిత్రంలో ధనుష్ లెక్చరర్‌గా కనిపిస్తారు. విద్యా వ్యవస్థ నేపధ్యంలో జరిగే కథ ఇది. బుధవారం విడుదలైన ప్రచార చిత్రం కానీ, శుక్రవారం హీరో ధనుష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్న వీడియో కానీ ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో రూపొందుతోంది ఈ చిత్రం. జి వి ప్రకాష్ సంగీతం, యువరాజ్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరింత వన్నె తెస్తాయని నమ్ముతున్నాను”అని తెలిపారు. “సార్ సినిమా అక్టోబర్‌లో విడుదలకానుంది. తెలుగు, తమిళ భాషల్లో తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది”అని చెప్పారు నిర్మాత నాగవంశీ.

Dhanush’s ‘SIR’ First Look Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News