Monday, December 23, 2024

ధనుష్ ‘సార్’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

Dhanush's 'SIR' Movie Teaser Released

తమిళ స్టార్ హీరో ధనుష్‌తో దర్శకుడు వెంకీ అట్లూరి తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రం ‘సార్’(తెలుగు), ‘వాతి’(తమిళం) షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సినిమాలో ధనుష్ లెక్చరర్‌గా నటిస్తున్నాడు. గురువారం ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. విద్యా వ్యవస్థ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్), శ్రీకర స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ధనుష్‌తో సంయుక్త మీనన్ జోడీ కడుతున్నారు. తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో రూపొందుతోంది ఈ చిత్రం. జి వి ప్రకాష్ సంగీతం, యువరాజ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్‌లో విడుదలకానుంది.

Dhanush’s ‘SIR’ Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News