Saturday, November 16, 2024

ప్రత్యేక డ్రైవ్‌తో ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి  : ధరణి దరఖాస్తులను ప్రత్యేక డ్రైవ్‌తో పరిష్కరించాలి జిఓ 58,59ల కింద ల్యాండ్ రెగ్యులరైజేషన్ కోసం వచ్చిన దరఖాస్థులను వేగంగా పరిష్కరించాలని రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ కలెక్టర్‌లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 58,59జిఓల కింద వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు. జిఓ 59లో దరఖాస్థులు చేసుకున్న లబ్ధ్దిదారులు సంబంధిత నిర్ణీత పేమెంట్‌ను సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధరణికి సంబంధించి ఎలాంటి దరఖాస్థులు పెండింగ్ లేకుండా స్పెషల్ డ్రైవ్ చేపట్టి పరిష్కరించాలన్నారు.

మిస్సింగ్ సర్వేనెంబర్‌లు, ఎక్స్‌టెంట్ కరెక్షన్ దరఖాస్థులలో ఆర్‌ఎస్‌ఆర్ విస్తీర్ణం ప్రస్తుతం ఉన్న సర్వేనెంబర్‌లు పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్‌లకు చెప్పారు. హైదరాబాద్ సిసిఎల్‌ఏ కార్యాలయం నుండి కలెక్టర్ శరత్ మాట్లాడుతూ జిఓ 58కింద గతంలో వచ్చిన దరఖాస్థులను పరిష్కరించామని, అర్హులై, వారికి క్రమబద్దీకరణ పట్టాసర్టిఫికెట్‌లను అందజేశామన్నారు. జిఓ59లో 471దరఖాస్థులు వచ్చాయని అందులో 313మంది డబ్బు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకున్నారన్నారు. 158మంది పూర్తి స్థాయిలో పేమెంట్ చేయలేదన్నారు. అందులో 33మంది 10లక్షలకు పైగా డబ్బుచెల్లించాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. సంబంధ్ధతులకు నోటీసుల జారీ చేశామని త్వరితగతిన డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకున్నామన్నారు. 2023సంవత్సరంలో జిఓ58లో కొత్తగా 3,391 దరఖాస్థులు రాగా 59కింద 2597 దరఖాస్థులు వచ్చాయన్నారు. వాటిని క్షేత్ర పరిథిలో పరిశీలిస్తున్నామని తెలిపారు. పెండింగ్ దరఖాస్థులను కొత్త దరఖాస్థులన్నింటిని ఈ నెలఖారులోగా పరిష్కా రిస్తామని కలెక్టర్ చెప్పారు. ధరణి వివిధ మ్యాడ్యుల్స్‌లో జిల్లాలో 1,21.,984దరఖాస్థులు రాగా ఇప్పటివరకు 1,08,648దరఖాస్థులను పరిష్కరించామని ఇంకా 13,336దరఖాస్థులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని 15రోజుల్లోగా పరిష్కారిస్తామని కలెక్టర్ అన్నారు. ఈ వీడియా కాన్ఫరెన్స్‌లో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, డిఆర్‌ఓ నగేష్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News