Thursday, January 23, 2025

త్వరలో ధరణి ప్రక్షాళన

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ భూముల కబ్జాను గుర్తించి స్వాధీనం చేసకుంటాం

ఏ ఒక్కరిపై కక్షపూరిత చర్యలు ఉండవు

తప్పుచేస్తే వదలం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్

ప్రజలు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యం తెస్తాం

ప్రజా పాలన ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం

కలెక్టర్లు,ఎస్‌పిలతో సిఎం రేవంత్‌రెడ్డి సమావేశం అనంతరం పొంగులేటి వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 10 సంవత్సరాల తరువాత ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు కోరుకుని తమకు పాలన అందించారని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నా రు. ఆదివారం సిఎం రేవంత్‌రెడ్డి,మంత్రులతో జ రిగిన కలెక్టర్ల, ఎస్పీల సమావేశం అనంతరం ఆ యన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లో నే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతను కేబినెట్ స మావేశంలో తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని,ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను మొదటి రెండు రోజుల్లో అమలు చేసి చూపించామన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల వద్దకే పాలన తెస్తామని చెప్పి అదే విధం గా రాష్ట్రంలో డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ అధికారులంతా ఒక టీం ఏర్పడి ప్రతి రోజు రెండు సమావేశాలు నిర్వహిస్తారని, పథకాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఫామ్‌లు ఇస్తామని లబ్దిదారులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వెంటనే స్దానిక అధికారులు రశీదు కూడా ఇస్తారని,అర్హులైన ప్రతి వారికి ఇచ్చిన మాట ప్రకారం వారి గుమ్మం వ ద్దకి పాలన తీసుకు వెళ్లుతామని తెలిపారు. అధికారులు చిన్నచూపు చూడకుండా ప్రభుత్వ అధికారులు చిన్న గూడెం అయిన, చెంచు గూడెం అయినా వెళ్ళాలన్నారు. గ్రామాల్లో కష్టాల్లో ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని వారి నుంచి చిత్తశుద్దితో దరఖాస్తు తీసుకోవాలని అధికారులను సూచించారు.

ధరణి పోర్టల్ ద్వారా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారని, గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ప్రభుత్వ భూములు కబ్జా చేసి పట్టా లు చేసుకున్నారని వాటిని గుర్తించి స్వాధీనం చే సుకుంటామన్నారు. త్వరలో ధరణి ప్రక్షాళన చే స్తామని, రై తులు జరిగిన తప్పును సరిదిద్ది భూ మి హక్కులు పొందేలా చూస్తామన్నారు. అధికారులు, రాజకీయ నాయకులపై కక్ష్య పూరితంగా ఏ ఒక్కరిపై చర్యలు ఉండవని, తప్ప చేసినవారిని ఎట్టి పరిస్ధితిలో వదిలే ప్రసక్తిలేదని కుండబద్దలు కొట్టారు. ఎన్నికల్లో ఇచ్చి ప్రతి హామీని అమలు చేస్తామని, ప్రజా పాలన కార్యక్రమానికి రూ. 25 కోట్లు విడుదల ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News