Sunday, December 22, 2024

ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి సిద్దిపేట, రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ కలెక్టర్లకు పిలుపు వచ్చింది. ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 22లో సమావేశం జరుగనుంది. సమావేశంలో భాగంగా అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉంది. ధరణి నిర్వహణ భూముల రిజిస్ట్రేషన్ పై ఉన్న సమస్యలపై వివరాలతో రావాలని కలెక్టర్లకు ఆదేశించారు. ఎంపిక చేసిన గ్రామాలు మండలాల్లో ధరణి మాడ్యూల్ శాంపిల్ ను కమిటీ చెక్ చేయనుంది. ధరణి వల్ల ప్రభావితమైన ప్రాంతాలపై కలెక్టర్ లను కమిటీ రిపోర్ట్ అడిగింది.  లోకసభ ఎన్నికలకు ముందే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చేందుకు కమిటీ కసరత్తు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News