Tuesday, November 5, 2024

నేడు ఐదు జిల్లాల కలెక్టర్‌లతో ధరణి కమిటీ భేటీ

- Advertisement -
- Advertisement -

సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటితో భేటీ అయిన సభ్యులు

మనతెలంగాణ/హైదరాబాద్: నేడు ఐదు జిల్లాల కలెక్టర్‌లతో ధరణి కమిటీ భేటీ కానుంది. ఇదే విషయమై ధరణి కమిటీ సభ్యులు,  సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయి ఇప్పటివరకు తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఆయన ముందుంచారు. ధరణి సమస్యలపై తక్షణ పరిష్కారాల కోసం ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తామని వారు మంత్రితో తెలిపారు. ఈ నేపథ్యంలోనే మధ్యంతర నివేదికకు సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రితో ధరణి కమిటీ సభ్యులు చర్చించారు.

ధరణిపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని, సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎంత ముఖ్యమో, ఇబ్బందులు రాకుండా చూసేలా ఈ నివేదిక ఉండాలని మంత్రి పొంగులేటి వారికి సూచించారు. అందులో భాగంగా సిద్దిపేట, మెదక్ జిల్లాలతో పాటు మరో మూడు జిల్లాలు మొత్తం ఐదు జిల్లాల కలెక్టర్లతో నేడు సిసిఎల్‌ఎలో ధరణి కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. అనంతరం జిల్లాల వారీగా క్షేత్రస్థాయి భూ సమస్యలపై ఈ కమిటీ ఆరా తీయనుంది. భేటీ అనంతరం రెవెన్యూ శాఖ మంత్రికి పూర్తి స్థాయి మధ్యంతర నివేదికను కమిటీ ధరణి కమిటీ సభ్యులు ఇవ్వనున్నారు. త్వరలోనే కమిటీ మధ్యంతర నివేదికపై సిఎం రేవంత్ రెడ్డితో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చర్చించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News