Tuesday, January 7, 2025

ధరణి పెండింగ్ దరఖాస్తుల్లో టాప్ రంగారెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సిసిఎల్‌ఏ కమిషనర్ నవీన్‌మిట్టల్ అన్ని జిల్లాల కలెక్టర్‌లను ఆదేశించారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్‌లతో ధరణి పెండింగ్ సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్ని జిల్లాలో కొత్తగా కలెక్టర్‌లు బదిలీల అయిన నేపథ్‌యంలో జిల్లాల వారీగా ధరణి సమస్యలపై మరోసారి కలెక్టర్‌లతో సిసిఎల్‌ఏ కమిషనర్ నవీన్‌మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 14వ తేదీన జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించిన విధంగా పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు,

ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులను క్లియర్ చేశారన్న విషయాల గురించి నవీన్‌మిట్టల్ ఆయా జిల్లాల కలెక్టర్‌లను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్‌ల దగ్గర ఉన్న పెండింగ్ గ్రీవెన్స్, డ్యాష్‌బోర్డు నివేదిక, ఆర్‌డిఓ, అడిషనల్ కలెక్టర్‌ల వద్ద ఉన్న దరఖాస్తుల పెండింగ్‌లను వెంటనే పరిష్కరించాలని నవీన్‌మిట్టల్ సూచించారు. ధరణిలో మ్యాడ్యూల్‌ను సవరించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా దరఖాస్తులను క్లియర్ చేయాలని కలెక్టర్‌లకు కమిషనర్ సూచించారు. లీగల్ సమస్యలు మినహా మిగతా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.

14వ తేదీ నుంచి 28 వరకు 21,206 క్లియర్ అయిన దరఖాస్తులు
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 14వ తేదీ నుంచి 28వ తేదీ (శనివారం) వరకు 22 జిల్లాలో 21,206 పెండింగ్ దరఖాస్తులను తహసీల్దార్‌ల నుంచి కలెక్టర్‌ల స్థాయి వరకు పరిష్కరించారు. అందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 3779 దరఖాస్తులకు మోక్షం లభించగా, ఇక నల్లగొండ జిల్లాలో 2120 దరఖాస్తులకు, సిద్ధిపేట జిల్లాలో 1880, సంగారెడ్డి జిల్లాలో 1,325, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,315 దరఖాస్తులకు పరిష్కారం లభించింది. జగిత్యాల జిల్లాలో 269 దరఖాస్తులు, జయశంకర్ భూపాలపల్లిలో 65 దరఖాస్తులు, మహబూబ్‌నగర్ జిల్లాలో 514, మంచిర్యాలలో 385, ములుగులో 78, నిర్మల్‌లో 142, రాజన్న సిరిసిల్లలో 97,

వికారాబాద్‌లో 1,019, వనపర్తిలో 235, వరంగల్‌లో 768, ఆదిలాబాద్‌లో 200, భద్రాద్రి కొత్తగూడెంలో 144, హన్మకొండలో 267, జనగాంలో 1,225, గద్వాల్‌లో 292, కామారెడ్డిలో 371 కరీంనగర్‌లో 775, ఖమ్మంలో 448, కుమురం భీం ఆసిఫాబాద్‌లో 225, మహబూబాబాద్‌లో 723, మెదక్‌లో 1420, మేడ్చల్ మల్కాజిగిరిలో 592, నాగర్‌కర్నూల్‌లో 1800, నారాయణపేటలో 185, నిజామాబాద్‌లో 793, పెద్దపల్లిలో 533, సూర్యాపేటలో 794 దరఖాస్తులు మొత్తంగా 21,206 దరఖాస్తులకు ఆయా జిల్లాల కలెక్టర్‌లు మోక్షం కల్పించారు.

పెండింగ్ దరఖాస్తుల వివరాలు ఇలా…
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా ధరణికి సంబంధించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, రెండో స్థానంలో సంగారెడ్డి జిల్లా, మూడోస్థానంలో వికారాబాద్ జిల్లా, నాలుగోస్థానంలో నల్లగొండ జిల్లాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని తహసీల్దార్‌ల దగ్గర 30,026 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, వికారాబాద్ తహసీల్దార్ దగ్గర 12,660, సంగారెడ్డి తహసీల్దార్ దగ్గర 11,240, నల్లగొండ తహసీల్దార్ దగ్గర 11,155 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్‌ల దగ్గర 1,18,979 ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఆర్‌డిఓల దగ్గర 41,106, అడిషనల్ కలెక్టర్‌ల దగ్గర 17,458, కలెక్టర్‌ల దగ్గర 9,561 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

కేటగిరి వారీగా దరఖాస్తులు ఇలా…
ధరణి పెండింగ్ దరఖాస్తుల్లో అధికంగా డేటా కరెక్షన్‌కు సంబంధించి పెండింగ్ ఉన్నాయని రెవెన్యూ అధికారులు తెలిపారు. వాటి తరువాత స్థానం పెండింగ్ మ్యుటేషన్, సక్సేషన్, ల్యాండ్ మ్యాటర్ గ్రీవెన్స్‌కు సంబంధించినవి ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇందులో డేటా కరెక్షన్‌కు సంబంధించి రాజన్న సిరిసిల్లలో 1642, జయశంకర్ భూపాలపల్లిలో 1,067, జగిత్యాలలో 2,200, మహబూబ్‌నగర్‌లో 2,043, మంచిర్యాలలో 3,679, వికారాబాద్‌లో 5,255, వనపర్తి 1,472, వరంగల్‌లో 960, ములుగులో 747, నిర్మల్‌లో 1,778, ఆదిలాబాద్‌లో 723, ఆసిఫాబాద్‌లో 1,301, భద్రాద్రి కొత్తగూడెంలో 2,197, గద్వాల్‌లో 1,605,

హన్మకొండలో 1,385, జనగాంలో 1,853, కరీంనగర్‌లో 4,007,ఖమ్మంలో 6,072, కామారెడ్డిలో 2,945, మహబూబాబాద్‌లో 1,727, మంచిర్యాలలో 2,915, మెదక్‌లో 3,004,నల్లగొండలో 15,353, నాగర్‌కర్నూల్‌లో 3,830, నిజామాబాద్‌లో 2,387, నారాయణపేటలో 876, పెద్దపల్లిలో 2,255, రంగారెడ్డిలో 15,875, సంగారెడ్డిలో 6,878, సిద్దిపేటలో 4,507, సూర్యాపేటలో 3,406, యాదాద్రి భువనగిరిలో 4,256 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News