ధరణి కమిటీ దృష్టికి అనేక లోపాలను తీసుకెళ్లిన కలెక్టర్లు 10 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : రెవెన్యూ అత్యంత వివాదాస్పదమైన ధరణి పోర్టల్ నిర్వహణపై బుధవారం కలెక్టర్లతో కోదండరెడ్డి కమిటీ నిర్వహించిన సమావేశం వాడివేడిగా జరిగింది. ధరణి పోర్టల్‌ను అ డ్డంపెట్టుకొని సుమారు 23 లక్షల ఎకరాల భూములను అక్రమంగా స్వాధీనం చేసుకొన్నట్లుగా తేలినట్లుగా ప్రా థమికంగా నిర్ధ్దారణకు వచ్చినట్లు తెలిసింది. ధరణి పో ర్టల్ మూలంగా సామాన్య రైతులే కాకుండా చివరకు క లెక్టర్ స్థాయి అధికారులు కూడా ముద్దాయిలుగా, నేరస్తులుగా మారిపోతున్నారని, ధరణి మూలంగా జరిగిన అనేక తప్పులకు మమ్ములను (కలెక్టర్లు) బాధ్యులుగా చే యడం సబబుకాదని, ఆ సమస్యల బారి నుంచి తమను రక్షించాలని సమావేశంలో పాల్గొన్న కలెక్టర్లు కమిటీని వేడుకొన్నట్లు తెలిసింది. 10 గంటలకు పైగా సుదీర్ఘంగా ఈ సమావేశం సాగింది.
సమావేశంలో ధరణి పోర్టల్ ని ర్వహణ సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ధరణి పోర్టల్ తప్పుల తడకగా, లోపభూయిష్టంగా ఉన్నదని క మిటీ ప్రాథమికంగా అభిప్రాయపడినట్లు తెలిసింది. 35 మాడ్యుల్స్ తెచ్చినా ప్రయోజనం లేదని, కలెక్టర్లు సైతం సమస్యలను పరిష్కరించలేకపోతున్నారని కమిటీ స్పష్టం చేసింది. ధరణి ఏర్పాటుకు ముందు గత ప్రభుత్వం మూడు కమిటీలను వేసిందని, అయితే ఆ కమిటీల సిఫారసులను ధరణిలో చేర్చలేదని నిగ్గుతేల్చింది. 18లక్షల ఎకరాలు పార్ట్ బి నిషేధిత జాబితాలో ఉన్నాయని అధి కారికంగా పేర్కొన్నప్పటికీ, అనధికారికంగా 23లక్షల ఎకరాలు పార్ట్‌బిలో ఉన్నట్లు కమిటీ దృష్టికి వచ్చింది. ధరణి సమస్యపై ఈ నెల 27న అటవీ, గిరిజన, వ్యవసాయ అధికారులతో సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది.
ఈ సమావేశంలో ధరణి పోర్టల్ నిర్వహణ ఎలా ఉంది? భూముల రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? అసై న్డ్ భూముల సమస్యలు, అటవీ, రెవెన్యూ సరిహద్దు స మస్యలు, ఆర్‌ఎల్‌ఆర్, నోషనల్ ఖాతా, వైవాటీ కబ్జాలు, భూవిస్తీర్ణం హెచ్చుతగ్గులు, పట్టాదార్ పాస్ పుస్తకంలో పేర్లు, ఇతర అక్షరాల తప్పులు తదితర సమస్యలపై వివరాలను ధరణి కమిటీకి కలెక్టర్లు అందజేసినట్లు తెలుస్తోంది. సచివాలయంలో బుధవారం ఉ. 10.30 గంటలకు ధరణి కమిటీ కలెక్టర్లతో సపమావేశమైంది. ఈ స మావేశానికి సిద్దిపేట, రంగారెడ్డి, నిజామాబాద్, ఖ మ్మం, వరంగల్ కలెక్టర్‌లు హాజరయ్యారు.
ఈ సమావే శం నుంచే అన్ని జిల్లాల కలెక్టర్లలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడినట్లు తెలిసింది. ధరణిలో వచ్చిన భూ స మస్యలు ఏమిటి? రైతులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు? ఎలాంటి సమస్యలు పరిష్కరించాలని పోర్టల్‌లోని మాడ్యూల్స్‌లో దరఖాస్తులు వచ్చాయా? ని జంగా రైతులకు భూ యజమానులకు ఏ సమస్యకు ఏ పోర్టల్‌లో దరఖాస్తు చేయాలో అవగాహన ఉందా? మీ సేవలో దరఖాస్తు చేసుకోవడానికి ఆప్షన్ లేని సమస్యలపై రైతులు వచ్చి దరఖాస్తు ఇస్తే పరిష్కరిస్తున్నారా? లేదా? అని ధరణి కమిటీ తొలుత ఆయా జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకుంది. ఈ సమావేశంలోనే శుక్ర, శనివారాల్లో ఏయే గ్రామాలకు వెళ్లాలో షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలిసింది. రెండు జిల్లాల్లో ఎంపిక చేసిన మండలాల్లో పర్యటించి ధరణి మాడ్యూల్‌ను శాంపిల్‌గా ఈ కమిటీ చెక్ చేసే అవకాశం ఉంది. ఈ గ్రామాల పర్యటన తర్వాత ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చేందుకు కమిటీ తన కసరత్తు వేగవంతం చేసింది. ధరణి కమిటీలో ఎం.కోదండరెడ్డి, ఎం. సునీల్ కుమార్, రేమండ్ పీటర్, నవీన్ మిట్టల్, మధుసూదన్‌లు ఉన్నారు.
కలెక్టర్ల మొర.. మమ్మల్ని బాధ్యుల్ని చేయడం సరికాదు!
ధరణి పునర్నిర్మాణ కమిటీ సమావేశంలో భాగంగా పలు సమస్యలను జిల్లా కలెక్టర్లు కమిటీ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిసింది. ధరణి విషయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలకు తమను బాధ్యులు చేయవద్దని కమిటీకి మొర పెట్టుకున్నారు. ధరణితో పాటు రెవెన్యూ వ్యవస్థలోని లోపాలకు తమను బాధ్యులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలోని అంశాలకు తమను బాధ్యులను చేయడం సరికాదంటున్న కలెక్టర్లు ధరణి కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.