Friday, November 15, 2024

ప్రభుత్వ ఆధ్వర్యంలో ధరణి పోర్టల్

- Advertisement -
- Advertisement -
Dharani portal is wholly owned by government 
ఈ విషయంలో ఎటువంటి అనుమానాలకు తావులేదు
 విదేశీ సాప్ట్‌వేర్ కంపెనీల హస్తాల్లో ఈ సాప్ట్‌వేర్ ఉందన్నది అపవాదే
 కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై ప్రభుత్వం వివరణ

హైదరాబాద్ : ధరణి పోర్టల్ పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ నియంత్రణలోనే పని చేస్తుందని, ఎటువంటి అనుమానాలకు ఈ అంశంలో తావులేదని ప్రభుత్వం వివరణ నిచ్చింది. కొన్ని ప్రసార మాధ్యమాల్లో ధరణి పోర్టల్ విదేశీ సాప్ట్‌వేర్ కంపెనీల హస్తాల్లో ఉందన్న అపవాదు సత్యదూరమని ప్రభుత్వం వెల్లడించింది. ఐఎల్ అండ్ ఎస్‌ఎస్ సంస్థ ఈ ప్రాజెక్టుకు సర్వీస్ ప్రొవైడర్ వ్యవహారిస్తోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2018లో టెండర్ ప్రక్రియ ద్వారా ఈ కంపెనీకి ఈ ప్రాజెక్టు దక్కిందని, ఇందులో ఎటువంటి దాపరికం లేదని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ కంపెనీకి టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ గా పేరు ఉందని, ఈ కంపెనీ ఐటి అప్లికేషన్లను ధరణి ఆరంభం నుంచి నిర్వహిస్తోందని ప్రభు త్వం తెలిపింది. ఈ కంపెనీ దేశంలోని ఒరిస్సా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ లో సిటీజన్ సర్వీసెన్ సేవలు అందిస్తుండగా, ఒరిస్సాలో ల్యాండ్ రికార్డులను నిర్వహిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ డేటా భద్రతపై ఎటువంటి అనుమానాలు, అభ్యంతరాలు అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది.

గచ్చిబౌలిలోని తెలంగాణ స్టేట్ డేటా సెంటర్‌లో..

ధరణి ప్రాజెక్టుకు చెందిన అప్లికేషన్ డేటా నిర్వహణ అం తా గచ్చిబౌలిలోని తెలంగాణ స్టేట్ డేటా సెంటర్‌లో ఉం టుందని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ స్టేట్ డేటా సెం టర్ పూర్తిగా ప్రభుత్వ పరిధిలో, ప్రభుత్వ నిర్వహణలో నడిచే ప్రభుత్వ యాజమాన్య సంస్థ అని, రాష్ట్ర ప్రభుత్వ మే దీనిని నిర్వహిస్తుందని వెల్లడించింది. ఈ స్టేట్ డేటా సెంటర్ ఇంకా ఇతర ప్రభుత్వ అప్లికేషన్లను, సేవలను కూడా నిర్వహిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ డేటా సెంటర్ కీలకమైన సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉంటుందని, ఎవరూ దీనిలోకి ప్రవేశించలేరని వెల్లడించింది. ధరణి పోర్టల్ నిర్వహణలో అనేక సెక్యూరిటీ పద్ధతులు, సేఫ్టీ నిర్వహణ విధానాలు, పూర్తిస్థాయిలో సాంకేతిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ధరణి పోర్టలను అభివృద్ధి పర్చింది మొత్తం రెవె న్యూ అధికారులేనని, డేటాను ఏ మాత్రం మార్చే అధికా రం అధికారులకు కూడా లేదని ప్రభుత్వం వెల్లడించింది.

క్వాంటెలా ఒప్పందం ద్వారానే ఇన్వెస్ట్ కంపెనీ

ఈ గ్రూపులో భాగంగా పలువురు ఇన్వెస్టర్లు సింగపూర్ గేట్‌వే క్యాపిటల్ ద్వారా అమెరికాకు చెందిన అవెన్యూ క్యాపిటల్‌లు టెర్రాసిస్లో పాలుపంచుకుంటున్నా యని ప్రభుత్వం పేర్కొంది. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎఎస్ డిజిన్వెస్ట్ మెంట్ ఎన్‌సీ ఎల్టీ ఆమోదం మేరకు జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. క్వాంటెలా ఒప్పందం ద్వారానే ఇన్వె స్ట్ కంపెనీ ఈ ఒప్పందంలోకి చేరిందని వెల్లడించింది. ఈ కంపెనీని హైదరాబాద్‌కు చెందిన శ్రీధర్ గాధీ నిర్వహిస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. టెర్రాసిస్ మొదటినుంచీ ధరణి పోర్టల్ నిర్వహణలో భాగస్వామ్యమై ఉందని, కొత్తగా విదేశీ కంపెనీలేవీ నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టులోకి రాలేదని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News