Wednesday, January 22, 2025

బిజెపి వస్తే ధరణి ప్రక్షాళన: జవదేకర్

- Advertisement -
- Advertisement -

బిజెపి రాష్ట్ర ఎన్నికల ఇన్ ఛార్జి ప్రకాశ్ జవదేకర్

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం జాతీయ సమాచారం కేంద్రం ద్వారా రూపొందించిన కంప్యూటరైజ్డ్ సాఫ్ట్‌వేర్ అన్ని రాష్ట్రాలకు అందుబాటులోకి తీసుకొచ్చిందని రాష్ట్ర బిజెపి ఎన్నికల ఇంచార్జీ ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. ఈ భూ రికార్డులను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అప్‌డేట్ చేసుకునేందుకు వీలుంటుందని, మొదట్లో ఈ రికార్డులను ఆధునీకరించే ప్రక్రియను టిసిఎస్‌కు కంపెనీకి అప్పగించారని తెలిపారు. మొదటి 3 నెలలు ఈ రికార్డులను పద్ధతిగా నిర్వహించిన టిసిఎస్ కంపెనీ ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో విధుల నుంచి తప్పుకుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం కోరినట్లుగా టిసిఎస్ పనిచేయనందుకే ఈ భాధ్యతలనుంచి తప్పుకున్న తర్వాత ఐఎల్‌ఎఫ్‌ఎస్ కంపెనీకి అప్పజెప్పినట్లు వెల్లడించారు.

ఆ కంపెనీ కూడా దివాళా తీసిన తర్వాత కేంద్రప్రభుత్వం ఇచ్చిన సాఫ్ట్‌వేర్‌ను టెర్రాస్ అనే మరో కంపెనీకి ప్రభుత్వం అప్పజెప్పిందన్నారు. అయినా దీని మనుగడ ప్రశ్నార్థకంగా ఉంది. వాస్తవమైన భూ రికార్డులను పూర్తిగా గందరగోళంగా కావడంతో కేంద్రం ఇచ్చిన నిబంధనలను బేఖాతరు చేస్తూ కొత్త రూల్స్ తీసుకరావడంతో కొందరు అధికారులు రికార్డులు తారుమారు చేశారనే ఆరోపణలు వచ్చాయన్నారు. బిజెపి అధికారంలోకి రాగానే ధరణిపై పూర్తిగా విచారణ జరిపి భూ యజమానులకు న్యాయం చేస్తామన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా నేడు మేనిఫెస్టో విడుదల చేస్తారని తెలిపారు. ఈ ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని కాంగ్రెస్ రాష్ట్రంలో కనుమరుగు అవుతుందని జోస్యం చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News