Wednesday, January 22, 2025

‘ధారవి’ పునరాభివృద్ధి యత్నం ముంబైకి మంచిది కాదు: ఉద్ధవ్ థాక్రే విమర్శ

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్ : ధారవి మురికి వాడను తిరిగి అభివృద్ధి చేయాలని నిర్ణయించడం ముంబైకి లేదా మహారాష్ట్రకు మంచిది కాదని శివసేన (యుబిటి) నేత ఉద్ధవ్ థాక్రే సోమవారం విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా బీజేపీ శనివారం పిలుపునివ్వడం కేవలం సెటిల్‌మెంట్ మోర్చా (డబ్బులు వసూలు ఆందోళన) గా ఎద్దేవా చేశారు. ధారవి పునరాభివృద్ధి ప్రాజెక్టుకు ప్రయత్నించడం అదానీ గ్రూప్‌కు ప్రయోజనం కలిగించడానికే అని శివసేన (యుబిటి)తోపాటు కాంగ్రెస్, ఎన్‌సిపి కూడా తీవ్రంగా విమర్శించాయి.

ఈప్రాజెక్టు చేపట్టడానికి అదానీ టెండర్ వేశారు. అయితే డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం మోర్చా పిలుపు ధారవికి చెందిన వారు కారని, ఇతరప్రాంతాల వారని వివరించారు. మరాఠా కోటా గురించి థాక్రే మాట్లాడుతూ ఇతర వర్గాల ప్రయోజనాలపై ఈ ప్రభావం పడకుండా మరాఠా రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు.

మంత్రి, సీనియర్ బీజేపీ నేత గిరీష్ మహాజన్‌తో గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం సహచరుడు సలీమ్‌కుత్తాతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్ )ను ఏర్పాటు చేయాలని థాక్రే డిమాండ్ చేశారు. మహాజన్‌కు ఫడ్నవీస్ క్లీన్‌చిట్ ఇచ్చారని ఆరోపించారు. సూరత్ డైమండ్ కాంప్లెక్సును ప్రధాని మోడీ ప్రారంభించడంపై వ్యాఖ్యానిస్తూ ముంబై నుంచి వాణిజ్యాన్ని గుజరాత్‌కు తరలించడంపై ఆక్షేపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News