- Advertisement -
హైదరాబాద్: గ్రూప్-1 పరీక్షల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులు టిజిఎస్‌పిఎస్‌సికి చెంపపెట్ట వంటిదని.. బిఆర్‌ఎస్ నేత రాకేశ్ రెడ్డి అన్నారు. ఎప్పటికైనా ధర్మానిదే అంతిమ విజయమని ఈ తీర్పుతో స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. ఇది పోరాడిన అభ్యర్థుల విజయమని.. అండగా నిలుచున్న బిఆర్ఎస్ ప్రార్టీది నైతిక విజయమని అన్నారు. పరీక్షల్లో 10 మంది అభ్యర్థులు ఎలా పెరిగారని.. అది కూడా సైబర్ నేరమా? అని ప్రశ్నించారు. పక్కాగా ఒక ప్యాటర్న్ ప్రకారం మార్కలు వేసినట్లు కనిపిస్తోందని తెలిపారు. గ్రూప్-1మ మొయిన్స్‌లో 21 ఉల్లంఘనలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై న్యాయ విచారణ లేదా సిబిఐ విచారణ జరపాలి అని రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
- Advertisement -