- Advertisement -
హైదరాబాద్: 14 ఏళ్ల తన పాలనలో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేశారని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ప్రశ్నించారు. శనివారం ధర్మాన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఒక్క శాతం కూడా మేలు చేయలేదని, ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్‌లను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని ధర్మాన దుయ్యబట్టారు. ఉద్దానం సమస్యపై బాబు ఏమీ చేయలేదని, జగన్ మోహన్ రెడ్డి సిఎం అయిన వెంటనే ఉద్దానంపై దృష్టి పెట్టారని, దశాబ్దాలుగా అధికారంలో ఉన్నవారు ఉద్దానాన్ని పట్టించుకోలేదని ధర్మాన మండిపడ్డారు. ఉద్దానం ప్రజలకు తాగునీటి కోసం రూ.700 కోట్లు ఖర్చు పెట్టామని, ఉద్దానం కిడ్నీ బాధితులకు సిఎం జగన్ పది వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నారని, త్వరలో ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు ప్రారంభమవుతుందన్నారు.
Also Read: ఒడిశాలో దారుణం: పెళ్లికాని దివ్యాంగుడికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్
- Advertisement -